వ్యవసాయ వర్సిటీలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-08-02T06:58:12+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు నాబార్డ్‌ అండగా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్‌ చింతల గోవిందరాజులు అన్నారు.

వ్యవసాయ వర్సిటీలకు అండగా ఉంటాం

ఆయిల్‌పామ్‌తో ఆదాయం: నాబార్డ్‌ చైర్మన్‌ 

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు నాబార్డ్‌ అండగా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్‌ చింతల గోవిందరాజులు అన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ఆర్థికంగా నాబార్డ్‌ చేయూతనిస్తుందన్నారు. అగ్రి- హార్టికల్చర్‌ సొసైటీ ఆఽధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు గతంలో చేసే రూ.20వేల కోట్ల కేటాయింపులను.. ఇప్పుడు రూ.80వేల కోట్లకు పెంచినట్లు తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుచేయటానికి అనుకూల వాతావరణం ఉందన్నారు. రైతులు ఎకరానికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌ పామ్‌ ఉప ఉత్పత్తులతో కూడా ఆదాయం లభిస్తుందన్నారు. కాస్మొటిక్‌ ఇండస్ట్రీ అభివృద్ధికి కూడా  తెలంగాణలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-02T06:58:12+05:30 IST