Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌లో మేథో వలసల నిరోధానికి మేం కట్టుబడి ఉన్నాం: కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో మేథో వలసలను అడ్డుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్రం సోమవారం స్పష్టం చేసింది.  భారత్‌లో ఐఐటీ, ఐఐఎమ్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు దేశంలోనే కొనసాగేలా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లోక్‌సభలో పేర్కొన్నారు. దేశంలో మేథో వలసల వెనుకున్న ప్రధాన కారణాన్ని ప్రభుత్వం అధ్యయనం చేసిందా అన్న ప్రశ్నకు మంత్రి ఇలా స్పందించారు. మేథోవలసలను నిరోధించడంతో పాటూ ఇప్పటికే భారత్ వీడిన ఎన్నారైలను కూడా తిరిగి స్వదేశంవైపు ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా ఐఐటీలు, ఐఐఎస్‌సీలో రీసెర్చ్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలు, స్టార్టప్‌లకు ఊతం ఇచ్చేలా వివిధ విద్యాసంస్థల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను కూడా నెలకొల్పుతామన్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement