దేశంలో ‘డెల్టా ప్లస్’ భయం.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-06-23T09:54:36+05:30 IST

భారతదేశంలో కరోనా కొత్త డెల్టా వేరియంట్ భయమే ఇంకా పోలేదు. అప్పుడే డెల్టా ప్లస్ (ఏవై.1) వేరియంట్ మరింత ఆందోళన పెంచుతోంది.

దేశంలో ‘డెల్టా ప్లస్’ భయం.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా కొత్త డెల్టా వేరియంట్ భయమే ఇంకా పోలేదు. అప్పుడే డెల్టా ప్లస్ (ఏవై.1) వేరియంట్ మరింత ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం దేశంలో ఇది కలవరపరిచే వేరియంట్ అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వేరియంట్లను పరిశీలించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ (ఐఎన్ఎస్ఏసీవోజీ).. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దీనిలో మూడు లక్షణాలు ఉన్నాయని పేర్కొంది. డెల్టా ప్లస్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఊపిరితిత్తుల్లోని కణాలకు చాలా బలంగా పెనవేసుకుంటోందని, అలాగే శరీరంలో యాంటీబాడీల స్పందనను ఈ వైరస్ వేరియంట్ తగ్గిస్తోందని పరిశోధకులు తెలిపారు. దీంతో ఈ వేరియంట్ ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-23T09:54:36+05:30 IST