Abn logo
Apr 4 2020 @ 03:01AM

చావు కబురు మెల్లగా!

  • కరోనా మృతిపై దాగుడు మూతలు
  • గతనెల 30వ తేదీన వ్యక్తి మృతి
  • మరుసటిరోజే కరోనా నిర్ధారణ?
  • జాగ్రత్తలు తీసుకోకుండానే ఖననం
  • కరోనా మృతిగా కేంద్రం ప్రకటన
  • తప్పనిసరై అంగీకరించిన రాష్ట్రం
  • ఆ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌
  • మృతుడి భార్యా ఆ లక్షణాలతోనే మృతి

అమరావతి/విజయవాడ, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏపీలో తొలి కరోనా మరణం సంభవించింది. ఎప్పుడో తెలుసా... మార్చి 30న! కానీ... అధికారులు ప్రకటించింది మాత్రం ఏప్రిల్‌ 3న! 4 రోజులు దాగుడుమూతలాడి, కేంద్ర ప్రభు త్వం దీనిని కరోనా లెక్కల్లో చేర్చిన తర్వాత... ఇక తప్పదన్నట్లుగా ఒక అధికార ప్రకటన చే శారు. ఈలోపు ఎంత నష్టంగా జరిగిందో తెలియదు! దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు! ఎందుకంటే... సదరు వ్యక్తి మృతదేహాన్ని ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే కుటుంబ సభ్యులకు అప్పగించారు.


విజయవాడకు చెందిన ఒక యు వకుడు ఢిల్లీలో మర్కజ్‌కు హాజరై... మార్చి 17న తిరిగి వచ్చారు. ఈ యువకుడి తల్లి మార్చి 29 అర్ధరాత్రి సమయంలో తీవ్ర శ్వాసకోశ సమస్యతో మరణించింది. ఆ మరుసటి రోజున ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె భర్త(55) కూడా అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు హు టాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30వ తేదీ ఉదయం 11.30కు ఆసుపత్రికి తీసుకురా గా... 12.30కు ఆయన చనిపోయారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.  మృ తుడి నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్షకు పంపారు. కరోనాతో మరణించారనే సందేహం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకూడదు. నివేదిక వచ్చేదాకా వేచి చూడాలి. ‘పాజిటివ్‌’ వచ్చినట్లు తేలితే... వైరస్‌ ఇతరులకు సోకకుండా మృతదేహాన్ని ప్రత్యేకమైన కవరులో చుట్టి, అధికారుల పర్యవేక్షణలోనే అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ... మృతుడి విషయంలో ఇదేదీ చేయలేదు. నమూనాలు సేకరించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేవలం 24 గంటల వ్యవధి లో భార్య, ఆ తర్వాత భర్త కూడా మరణించడంతో కు టుంబ సభ్యులు అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అదే రోజు(మార్చి 30) సాయంత్రం ఖనన కార్యక్రమాన్ని నిర్వహించారు.


దాచి పెట్టారా... 

చనిపోయిన వ్యక్తి కుమారుడి నమూనాలు కూడా మార్చి 30నే సేకరించి పరీక్షలకు పంపించారు. అతనికి వైరస్‌ సోకినట్లు ఆ మరుసటి రోజేనే(మార్చి 31న ) నిర్ధారణ అయ్యింది. అంటే... మృతుడికి కూడా వైరస్‌ సోకిందని అదే రోజు నివేదిక అంది ఉండాలి. కానీ, ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. ఆయన ఇతర ఆరో గ్య సమస్యలతో చనిపోయినట్లు ప్రకటించారు. ఆ యు వకుడికి పాజిటివ్‌ వచ్చిన తర్వాత... కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించారు. అదే ఇంట్లో కొత్తగా 5 పాజిటివ్‌లు తేలాయి. అంటే... ఒకే ఇంట్లో ఒకరు కరోనాతో మరణించగా, మరో ఆరుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మృతుడి భార్య కూడా కరోనా కారణంగానే మరణించారనే అనుమానాలు వ్యక్తమవుతునప్పటికీ... దీనిని నిర్ధారించలేని పరిస్థితి. కరోనాతో మృతి చెందిన బాధితుడి విషయంలో వచ్చిన అనుమానాలను అధికారులు తోసిపుచ్చారు. బీపీ, షుగరుతోపాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు.. మృతుడి అంత్యక్రియల సందర్భంగా దేహాన్ని తాకిన బంధువుల్లోనూ ‘కరోనా’ భయం మొదలైంది.


3 మరణాలపై అనుమానం!

55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించినట్లు ఇప్పుడు నిర్ధారించగా... ఆయన భార్య కూడా వైరస్‌ వల్లే చనిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమె అస్వస్థతకు గురికాగానే, స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లేలోపే మరణించడం, వెంటనే  అంత్యక్రియలు నిర్వహించడంతో వ్యాధి నిర్ధారణకు అవకాశం కలుగలేదు.  మరోవైపు విజయవాడకే చెందిన ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మార్చి 28వ తేదీన ఆకస్మాత్తుగా మృతి చెందారు. ఆ తర్వాత రోజునే ఆయన భార్య కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. 

Advertisement
Advertisement
Advertisement