Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ కార్యాలయంలోకి దర్జాగా వెళ్లిన మేక.. అక్కడ అది చేసిన పనికి తలలు పట్టుకున్న అధికారులు.. ఆ తర్వాత దాని వెనకాలే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ కార్యాలయంలోకి దర్జాగా వెళ్లిన ఓ మేక.. అక్కడి అధికారులు తలలుపట్టుకునేలా చేసింది. అంతేకాకుండా అక్కడి సిబ్బందిని పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఆ మేకకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అధికారులు తలలుపట్టుకునేంత పని ఆ మేక ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి ఓ మేక బుధవారం రోజు దర్జగా ప్రవేశించింది. అనంతరం కొద్ది సమయం వరకూ ఆఫీస్‌లోనే అటూ ఇటూ తిరిగింది. ఆ తర్వాతే.. అక్కడి అధికారులకు షాకిచ్చింది. కార్యాలయంలో ఉన్న ఓ ముఖ్యమైన ఫైలును నోట కరుచుకుని బయటికొచ్చింది. అది గమనించిన అధికారులు.. తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కార్యాలయంలో పని చేసే సిబ్బంది.. ఫైలు కోసం మేక వెంట పరుగులు తీశారు. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆఫీస్‌లోకి మేక వచ్చి.. ఫైల్‌ను తీసుకెళ్లేదాకా మీరేం చేస్తున్నారు’ అంటూ కామెంట్ల రూపంలో అధికారులపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. 
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement