పీఆర్సీ జీవోలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-27T05:59:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను రద్దుచేయాలని కోరుతూ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు.

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలి
కొవ్వూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం

కొవ్వూరు, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను రద్దుచేయాలని కోరుతూ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చీకటి జీవోలను, సీపీఎస్‌ను వెంటనే రద్దుచేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. డి.రాధాకృష్ణ, పి.దుర్గా కిశోర్‌, ఎస్‌వీ. దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఏఎంసీ, మున్సిపల్‌ కాంట్రాక్టు వర్క ర్లు, ఆర్టీసీ ఎన్‌ఎంయూ సిబ్బంది అంబేడ్కర్‌కు వినతిపత్రాలు అందజేశారు.


నల్లజర్ల: చీకటి జీవోలను రద్దు చేసి మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ రూపొందించాలని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.నరహరి అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి ఉద్యోగులు వినతి పత్రం అందించారు. బొందాల శ్రీను, శేషబ్రహ్మం, బండి కిశోర్‌, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


చింతలపూడి: న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి బీవీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఎస్‌.కె.అబ్రార్‌ హుస్సేన్‌, పూరేటి శ్రీనివాసరావు, దామోదర్‌, కాంతా రావు, గంధం రాంబాబు, బాలకృష్ణ, చెంచెం రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:59:28+05:30 IST