పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం

ABN , First Publish Date - 2022-01-21T05:07:06+05:30 IST

ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ మార్కెట్‌ కమిటీల అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటరత్నం అన్నారు.

పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
కొవ్వూరులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

కొవ్వూరు, జనవరి 20: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ మార్కెట్‌ కమిటీల అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటరత్నం అన్నా రు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్‌) పిలుపుమేరకు గురువారం కొవ్వూరు ఏఎంసీ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. చీకటి జీవోల ప్రతులను దహం చేశారు. అప్రజాస్వామిక పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దాసరి మోహన్‌, సుంకవల్లి హరికృష్ణ, బయ్య కుమార్‌, వెంకటరాజు, శివ, బాలాజీ, సురేష్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పీఆర్సీ వ్యతిరేక ఉద్యమానికి పెన్షనర్లు పెనుమాక జయరాజు, కొప్పాక జవహార్‌, మద్దాల వెంకట్రావు, కొల్లి రమేష్‌ సంఘీబావం తెలిపారు.

కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ కొవ్వూరు అధ్యక్షుడు పొరిపిరెడ్డి రవిశంకర్‌ అన్నారు. జిల్లా నాయకులను ఏలూరులో గృహ నిర్భందం చేయడాన్ని ఖండించారు. ఉద్యోగుల జీతభత్యాలకు ఎక్కువ ఖర్చు అవుతుందన్న ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలన్నారు. 


ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన


గోపాలపురం/కొయ్యలగూడెం: చీకటి జీవోలపై ఫ్యాప్టో నాయకులు నిరస న వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ముట్టడికి గోపాలపురం, కొయ్యలగూడెం మం డలాల నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు సోమేశ్వర శాస్త్రి, జాన్‌బాబు, సనపల రాజశేఖర్‌ మాట్లా డుతూ చీకటి జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గోపాలపురం మండలం నుంచి 60 మంది, కొయ్యలగూడెం నుంచి 70 మంది ఉపాధ్యా యులు వెళ్లారని ఫ్యాప్టో, ఏపీటీఎఫ్‌ నేతలు ఎం.వర కుమార్‌, అబ్బులు, వై.వీరభద్రయ్య, కె.సుబ్బారావు తెలిపారు.



Updated Date - 2022-01-21T05:07:06+05:30 IST