యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2020-07-01T04:34:51+05:30 IST

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌‌కిరణ్ రాయ్ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ...

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌‌కిరణ్ రాయ్ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు 2022 మే 31 వరకు, లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన బ్యాంకు ఎండీగా కొనసాగుతారని ఆర్ధిక శాఖ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ప్రకారం జాతీయ బ్యాంకుల్లో ఎండీకి వయో పరిమితి 60 ఏళ్లుగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా మూడేళ్ల పదవీ కాలానికిగానూ 2017 జూలై 1న రాయ్ నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా ఎండీగా బాధ్యతలు చేపట్టే ముందు ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పరేషన్ బ్యాంకులు ఇటీవల విజయవంతంగా విలీనమైన నేపథ్యంలోనే రాయ్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించడం గమనార్హం. 

Updated Date - 2020-07-01T04:34:51+05:30 IST