Advertisement
Advertisement
Abn logo
Advertisement

2022లో ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. జీవో జారీ చేసిన సర్కారు.. ఆదివారం ఎన్ని పండుగలు వచ్చాయంటే..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : 2022 సంవత్సరంలో పండుగలు, ఇతర సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులను గుర్తించి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు. ముఖ్యమైన సెలవులు జనవరి 1 నూతన సంవత్సరం, 15 సంక్రాంతి, 26 గణతంత్రదినోత్సవం, మార్చి 1 మహాశివరాత్రి, 18 హోళీ, ఏప్రిల్‌ 2 ఉగాది, 10 శ్రీరామనవమి, 14 అంబేడ్కర్‌ జయంతి, 15 గుడ్‌ఫ్రైడే, మే 3, 4 రంజాన్‌, ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవం, సెప్టెంబరు 25 బతుకమ్మ ప్రారంభరోజు, అక్టోబరు 5 విజయదశమి, 9 మిలాద్‌-ఉన్‌-నబి, 25 దీపావళి, డిసెంబరు 25 క్రిస్‌మ్‌సగా పేర్కొన్నారు. కాగా, వారాంతపు సెలవు దినం అయిన ఆదివారం నాడు ఆరు సెలవు దినాలు రావడం గమనార్హం.Advertisement
Advertisement