Narendra tomar : సాగు చట్టాల విషయంలో పారదర్శకంగా ఉన్నాం

ABN , First Publish Date - 2021-08-04T23:12:30+05:30 IST

సాగు చట్టాల విషయంలో తాము పూర్తి పారదర్శకంగా, స్పష్టంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర

Narendra tomar : సాగు చట్టాల విషయంలో పారదర్శకంగా ఉన్నాం

న్యూఢిల్లీ : సాగు చట్టాల విషయంలో తాము పూర్తి పారదర్శకంగా, స్పష్టంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని, అసలు వారికేం కావాలో వారికే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నూతన సాగు చట్టాలకు సంబంధించిన చర్చను ఉభయ సభల్లోనూ దాదాపు నాలుగు గంటల పాటు చర్చించామని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన జవాబులివ్వడంతో పాటు, ప్రతిపక్షాలు అడిగిన సందేహాలను కూడా నివృత్తి చేశామని తెలిపారు. ప్రతిపక్షాలే ఈ విషయంలో అయోమయంలో ఉన్నాయని తోమర్ విమర్శించారు. 

Updated Date - 2021-08-04T23:12:30+05:30 IST