అత్యధిక కోవిడ్ కేసుల రాష్ట్రాల జాబితాను విడుదల చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2021-05-17T02:17:48+05:30 IST

అత్యధిక కోవిడ్ కేసుల రాష్ట్రాల జాబితాను విడుదల చేసిన కేంద్రం

అత్యధిక కోవిడ్ కేసుల రాష్ట్రాల జాబితాను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. భారతదేశంలో గత 24 గంటల్లో 10 రాష్ట్రాల్లో 75శాతం కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్రం ఆదివారం తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా కోవిడ్ కేసులు అత్యధికంగా 41,664 నమోదయ్యాయని, తరువాత మహారాష్ట్రలో 34,848 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. తర్వాత తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, యూపీ, ఒడిశా మరియు హర్యానా రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.

Updated Date - 2021-05-17T02:17:48+05:30 IST