కాంట్రాక్టు కార్మికురాలిని అండర్ సెక్రటరీ ఏం చేశాడంటే...వీడియో వైరల్, నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-11T17:04:36+05:30 IST

ఓ మహిళా కాంట్రాక్టు కార్మికురాలిని లైంగికంగా వేధించినందుకు లక్నోలోని బాపు భవన్ మైనారిటీ డెవలప్‌మెంట్ సెక్షన్ ఇన్‌చార్జి, అండర్ సెక్రటరీ ఇచ్చారామ్ యాదవ్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు...

కాంట్రాక్టు కార్మికురాలిని అండర్ సెక్రటరీ ఏం చేశాడంటే...వీడియో వైరల్, నిందితుడి అరెస్ట్

లక్నో:ఓ మహిళా కాంట్రాక్టు కార్మికురాలిని లైంగికంగా వేధించినందుకు లక్నోలోని బాపు భవన్ మైనారిటీ డెవలప్‌మెంట్ సెక్షన్ ఇన్‌చార్జి, అండర్ సెక్రటరీ ఇచ్చారామ్ యాదవ్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు ఇచ్చారాం యాదవ్‌ను యూపీ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ సెక్షన్‌ ఇన్‌చార్జిగా నియమించింది.2018 నుంచి అండర్‌ సెక్రటరీ యాదవ్ తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.దీనిపై ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించారని మహిళ తెలిపింది. ఇటీవల ఆమె ధైర్యం చేసి తనను లైంగికంగా వేధించిన యాదవ్‌ వీడియోను విడుదల చేసింది.


 వీడియోలో యాదవ్ మహిళను బలవంతం చేయడం కనిపించింది.దీంతో బాధిత మహిళ అక్టోబర్ 29న హుస్సేన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ పోలీసులకు సాక్ష్యంగా పలు వీడియోలను సమర్పించింది. అండర్‌ సెక్రటరీ హోదాలో యాదవ్‌కు మంచి పలుకుబడి ఉండటంతో పోలీసులు మొదట్లో అరెస్టు చేయలేదని బాధితురాలు ఆరోపించారు. దీంతో విసుగు చెందిన ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మహిళ ఫిర్యాదుపై అక్టోబర్ 29న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సెంట్రల్ ఖ్యాతి గార్గ్ చెప్పారు. బాధిత మహిళ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి పిలిచామని,  ఇరువర్గాల వాంగ్మూలాలను నమోదు చేసి, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. 

Updated Date - 2021-11-11T17:04:36+05:30 IST