వారంలో జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గాయి: కేంద్రం

ABN , First Publish Date - 2021-06-12T04:57:52+05:30 IST

వారంలో జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గాయి: కేంద్రం

వారంలో జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గాయి: కేంద్రం

న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు తగ్గుతున్న జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 4తో ముగిసిన వారంలో 531 జిల్లాల్లో రోజూ 100కు పైగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది. మే నెలతో పోల్చి చూస్తే జూన్ 9తో ముగిసిన వారంలో 196 జిల్లాల్లో 100కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. మరో వైపు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివిటీ రేటు రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. కరోనా కేసులు దేశంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ మరణాలు తగ్గుతున్నాయి, రోజువారీగా కోవిడ్ రోగులు భారీ సంఖ్యలో కోలుకుంటున్నారు.

Updated Date - 2021-06-12T04:57:52+05:30 IST