ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయలేదేం?

ABN , First Publish Date - 2020-05-24T07:53:52+05:30 IST

కరోనా నేపథ్యంలో తీసుకున్న చర్యలకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడంలో న్యాయ వ్యవస్థ తన విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే...

ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయలేదేం?

  • విద్యుక్త ధర్మం నెరవేర్చని న్యాయ వ్యవస్థ
  • వలస కార్మికుల విషయంలో వైఫల్యం
  • కోర్టులపై సుప్రీం బార్‌ అసోసియేషన్‌ 
  • అధ్యక్షుడు దుష్యంత్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 23: కరోనా నేపథ్యంలో తీసుకున్న చర్యలకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడంలో న్యాయ వ్యవస్థ తన విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే విమర్శించారు. ‘మహమ్మారి ప్రబలినప్పుడు న్యాయవ్యవస్థ పాత్ర’ అన్న అంశంపై శనివారం ఇక్కడ ఒక వెబ్‌నాయిర్‌లో ఆయన ప్రసంగిస్తూ న్యాయ వ్యవస్థ, కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి తలెత్తినప్పుడు న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో ఆసక్తిరమైనదని, కీలకమైనదని దవే అన్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ  విచిత్రంగా ఒక పద్ధతి ప్రకారం రాజీపడిపోయిందని  విమర్శించారు. ప్రభుత్వ దైనందిన కార్యకలాపాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు.. కానీ, ప్రభుత్వాన్ని కచ్చితంగా జవాబుదారీ చేయాలన్నారు. దేశంలోని వలస కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో న్యాయవ్యవస్థ విఫలమయ్యిందని ఆరోపించారు.  


తబ్లిగీల వల్లే ఎంపీలో కరోనా వ్యాప్తి: సీఎం చౌహాన్‌

మధ్యప్రదేశ్‌లో ముఖ్యంగా ఇండోర్‌, భోపాల్‌ నగరాలలో తబ్లిగీ జమాత్‌ సభ్యుల కారణంగానే తొలుత కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-05-24T07:53:52+05:30 IST