కరోనా స్పైషల్ ట్రైన్‌లో సిగరెట్ల స్మగ్లింగ్!

ABN , First Publish Date - 2020-07-11T03:55:22+05:30 IST

కరోనా కష్టకాలంలో వలసకార్మికులను ఇళ్లకు చేర్చడం కోసం రైల్వేశాఖ ప్రత్యేకంగా రైళ్లు నడుపుతోంది.

కరోనా స్పైషల్ ట్రైన్‌లో సిగరెట్ల స్మగ్లింగ్!

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో వలసకార్మికులను ఇళ్లకు చేర్చడం కోసం రైల్వేశాఖ ప్రత్యేకంగా రైళ్లు నడుపుతోంది. ఈ సదుపాయాన్ని కూడా కొందరు నీచులు స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారు. తాజాగా వారణాసి-ఢిల్లీ రైళ్లో జరిగిన ఉదంతమే దీనికి మంచి నిదర్శనం. వారణాసి నుంచి ఢిల్లీకి కొవిడ్-19 స్పెషల్ ట్రైన్‌ను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్‌లో స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం అందుకున్న ఢిల్లీ కస్టమ్స్ అధికారులు.. రైల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో విదేశా బ్రాండ్‌కు చెందిన 10లక్షల సిగరెట్లు, స్వదేశానికి చెందిన 9లక్షల సిగరెట్లు అధికారులకు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకున్న వారు.. ఈ స్మగ్లింగ్‌తో సంబంధాలున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సిగరెట్ల మార్కెట్ విలువ రూ.1.5కోట్లపైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-07-11T03:55:22+05:30 IST