65 మంది టీచర్లు.. వందల మంది తల్లిదండ్రులు ఉన్న వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్ షేర్ చేసిన ఉపాధ్యాయుడు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-23T02:25:44+05:30 IST

వందలాది మంది తల్లిదండ్రులు, 65 మంది మహిళా టీచర్లు ఉన్న వాట్సప్ గ్రూప్‌లో ఓ ఉపాధ్యాయుడు అశ్లీల వీడియో లింక్‌ను షేర్ చేశాడు. ఈ క్రమంలో కొందరు ఆ వీడియో లింక్‌ను క్లిక్ చేసి, కంగుతిన్నారు. అనం

65 మంది టీచర్లు.. వందల మంది తల్లిదండ్రులు ఉన్న వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్ షేర్ చేసిన ఉపాధ్యాయుడు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: వందలాది మంది తల్లిదండ్రులు, 65 మంది మహిళా టీచర్లు ఉన్న వాట్సప్ గ్రూప్‌లో ఓ ఉపాధ్యాయుడు అశ్లీల వీడియో లింక్‌ను షేర్ చేశాడు. ఈ క్రమంలో కొందరు ఆ వీడియో లింక్‌ను క్లిక్ చేసి, కంగుతిన్నారు. అనంతరం ఏం జరిగింది.. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌లోని స్టేట్ ఎడ్యుకేషన్ సెంటర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పదుల సంఖ్యలో స్కూళ్లను విభజించి.. అందులోని టీచర్లు, తరగతుల వారీగా విద్యార్థులతో ఓ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే రేవా ప్రాంతానికి చెందిన 28స్కూళ్లలోని ఐదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, వందలాది మంది ఉపాధ్యాయుల ఫోన్ నెంబర్లతో డీజీఎల్ఈఏపీ అనే వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేసింది.



ఈ గ్రూప్‌లో కృపాశంకర్ అనే ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. ఈయన నవంబర్ 20న.. ఓ అశ్లీల వీడియో లింక్‌ను గ్రూప్‌లో షేర్ చేశారు. అనంతరం పొరపాటును గుర్తించి.. ఆయన ఆ లింక్‌ను డిలిట్ చేశారు. అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ గ్రూప్‌లో అలజడి రేగింది. కొందరు మహిళా టీచర్లు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ వీడియో లింక్‌ను క్లిక్ చేసి కంగుతిన్నారు. అనంతరం గ్రూప్‌ నుంచి లెఫ్ట్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.

ఈ నేపథ్యంలో.. దీనిపై కృపాశంకర్ పబ్లిక్‌గా స్పందించారు. పొరపాటున ఆ లింక్‌ను గ్రూప్‌లో షేర్ చేసినట్టు వెల్లడించారు. తాను చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. అంతేకాకుండా ఇటువంటి పొరపాటు మరోసారి చేయనని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. దీనిపై విచారణ జరిపి, అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు.



Updated Date - 2021-11-23T02:25:44+05:30 IST