ప్రియాంకపై కేంద్రం ప్రతీకార రాజకీయాలు: ఆజాద్

ABN , First Publish Date - 2020-07-02T20:34:13+05:30 IST

ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను కేంద్రం అడగటంపై రాజ్యసభలో ఆ పార్టీ నేత గులాం..

ప్రియాంకపై కేంద్రం ప్రతీకార రాజకీయాలు: ఆజాద్

న్యూఢిల్లీ: ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను కేంద్రం అడగటంపై రాజ్యసభలో ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు.


'ప్రియాంక గాంధీని ఇల్లు ఖాళీ చేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం విచారకరం. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోంది. గాంధీ కుటుబం భద్రతను తగ్గించడం మొదటిది. ఇప్పుడు ఆమె ఇంటిని ఖాళీ చేయమంటున్నారు. బీజేపీయేతర ఎంపీలు ఎంతమంది న్యూఢిల్లీలో పెద్దపెద్ద బంగ్లాల్లో ఉంటున్నారు?' అని ఆజాద్ ఓ ట్వీట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు.


ప్రభుత్వ అలాట్‌‌మెంట్ రద్దు కావడంతో 35 లోథి ఎస్టేట్ బంగ్లాను ఆగస్టు 1వ తేదీలోగా ఖాళీ చేయాలని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రియాంకను ఆదేశించింది. గత ఏడాది ప్రియాంకకు ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించింది. ఇప్పుడామెకు ఆ రక్షణ లేకపోవడంతో బంగ్లా అలాట్‌మెంట్ రద్దు చేస్తూ, ఖాళీ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Updated Date - 2020-07-02T20:34:13+05:30 IST