గ్రామీణ భారతంలో సమర్ధవంతంగా కోవిడ్ మేనేజిమెంట్: కేంద్ర ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2021-06-13T00:29:51+05:30 IST

గ్రామీణ భారతంలో కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సదుపాయాలు..

గ్రామీణ భారతంలో సమర్ధవంతంగా కోవిడ్ మేనేజిమెంట్: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: గ్రామీణ భారతంలో కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సదుపాయాలు, నిర్వహణకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇది నిరంతర ప్రక్రియ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారంనాడు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యంతో ప్రజారోగ్య చర్యలపై పురోగమిస్తున్నట్టు పేర్కొంది. గ్రామీణ భారతంలో తగినన్ని హెల్త్‌కేర్ వసతులు, సేవల విషయంలో భారత ప్రభుత్వ నిలకడలేమి వల్ల విషాదం చోటుచేసుకుంటోందంటూ కొన్ని మీడియా కథనాలపై ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో స్పందించింది.


గ్రామీణ భారతంలో కోవిడ్ సమర్ధ నిర్వహణకు సమర్ధవంతంగా పనిచేస్తున్నామని, బహుళ అంచెల హెల్త్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను పటిష్టం చేయడం, రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రజారోగ్య చర్యలపై దృష్టి సారించడం జరుగుతోందని తెలిపింది. ఆరోగ్య మౌలిక వసతుల కల్పన అనేది నిరంతర ప్రక్రియ అని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన విస్తృతమైన నెట్‌వర్క్ ఉందని కూడా స్పష్టం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సబ్-హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను 2022 డిసెంబర్ నాటికి ఏబీ-హెచ్‌డబ్ల్యూసీలుగా మార్చనున్నామని, దీంతో సమగ్ర ప్రైమరీ హెల్త్ కేర్‌‌‌ జరుగుతుందని తెలిపింది.

Updated Date - 2021-06-13T00:29:51+05:30 IST