అక్టోబరులో పెరిగిన ప్రభుత్వ వ్యయం... రాబడిలో తగ్గుదల

ABN , First Publish Date - 2020-11-29T20:26:01+05:30 IST

కేంద్ర బడ్జెట్ ఖర్చులు అక్టోబరు నెలలో 9.5 శాతం మేర పెరిగాయి. కాగా సెప్టెంబరులో 26 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. కాగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వ్యయ వృద్ధి బడ్జెట్ 13.2 శాతంగా ఉంటుందని అంచనా. ఏప్రిల్-అక్టోబరు మధ్య గణాంకాలు రెండు శాతం క్షీణించినట్లు కనిపించినప్పటికీ అక్టోబరులో రూ. 31,519 తో కాపెక్స్ 130 శాతం పెరిగింది.

అక్టోబరులో పెరిగిన ప్రభుత్వ వ్యయం... రాబడిలో తగ్గుదల

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ ఖర్చులు అక్టోబరు నెలలో 9.5 శాతం మేర పెరిగాయి. కాగా సెప్టెంబరులో 26 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. కాగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వ్యయ వృద్ధి బడ్జెట్ 13.2 శాతంగా ఉంటుందని అంచనా. ఏప్రిల్-అక్టోబరు మధ్య గణాంకాలు రెండు శాతం క్షీణించినట్లు కనిపించినప్పటికీ అక్టోబరులో రూ. 31,519 తో కాపెక్స్ 130 శాతం పెరిగింది. ఏప్రిల్-అక్టోబరులో నికర పన్ను ఆదాయం సంవత్సరానికి 16 శాతం మేర తగ్గింది. ఈ నేపధ్యంలో ద్రవ్యలోటు బడ్జెట్‌లో అంచనా వేసిన రూ. 8  లక్షల కోట్ల కంటే రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్-అక్టోబరు ఆర్థిక లోటు లక్ష్యంతో 119.7 శాతంగా ఉంది.


పన్ను ఆదాయం రూ. 2.6 లక్షల కోట్లు తగ్గవచ్చు...

అన్‌లాక్ నేపధ్యంలో దేశ ఆర్థికవ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ పన్ను వసూళ్లు లక్ష్యం కంటే రూ. 2.6 లక్షల కోట్ల మేర తగ్గవచ్చని ఆర్థిక శాఖ అధికారులు బుతున్నారు. బడ్జెట్‌లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 24.23 లక్షల కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల మొత్తానికి సమానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైనపక్షంలో ఫరవాలేదని, అయితే... అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామని చెబుతున్నారు.


కాగా... 2019-230 స్థూల పన్ను వసూళ్ల సవరించిన అంచనా రూ. 21.63 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ. 20.10 లక్షల కంటే ఇది 7.6 శాతం ఎక్కువ. 2020.21 లో మొదటి అర్ధ సంవత్సరంలో పన్ను మొత్తం రూ. 7.21 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో వసూలైన మొత్తం కంటే 21.6 శాతం మేర తక్కువ.


పన్ను వసూళ్ల అంచనాలు సవరించవచ్చు...

కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు దేశమంతా లాక్ డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... పన్ను వసూళ్ల లోటు గతంలో అంచనా వేసినంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. 2019-20 అదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పన్ను ఆదాయం 32.6 శాతం, జూలై-సెప్టెంబరు కాలంలో 13.1 శాతం తగ్గింది. డిసెంబరు త్రైమాసికం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల అంచనాలను సవరించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. 

Updated Date - 2020-11-29T20:26:01+05:30 IST