Advertisement
Advertisement
Abn logo
Advertisement

గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తెరిపించాలి

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 30 : అప్రకటి తంగా మూసివేసిన వంగూరు పరిధిలోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్‌ను వెంటనే తెరిపించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. వెంకటేశ్వ రరావు, యూనియన్‌ అధ్యక్షుడు వి.పద్మ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, కార్మిక సమస్యల ను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీలో 250 మంది మహిళా కార్మికులు, 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిందన్నారు. ఫ్యాక్టరీ మూసివేయడం దారుణమని, కార్మికులకు రావాల్సిన పెండింగ్‌ జీతాలు, బోనస్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బద్దా వెంకట్రావు, వీరబాబు, ఆలీసమ్మ, బేబి, బుజ్జమ్మ, రాణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement