పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-21T06:42:56+05:30 IST

పట్టభద్రుల కోటా కింద త్వరలో జరుగనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థి ఎన్నిక కోసం పట్టభద్రులు ఓటరుగా

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

శామీర్‌పేట: పట్టభద్రుల కోటా కింద త్వరలో జరుగనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థి ఎన్నిక కోసం పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తూంకుంట మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు కాసుల సుభా్‌షగౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తూంకుంటలో విలేకరులతో మాట్లాడుతూ.. తూంకుంట మున్సిపల్‌ పరిధిలో గల 2016 ముందు ఎదైనా డిగ్రీ విద్యలో ఉత్తీర్ణులైన యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని ఆయన తెలిపారు.


మున్సిపల్‌లోని పట్టభద్రుల ఎన్నికల ఫారం-18లో వివరాలను నింపి సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో గానీ, ఆన్‌లైన్‌లో గానీ సమర్పించాలని ఆయన వెల్లడించారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫామ్‌-18తో పాటు రెండు పాస్‌ ఫొటోలు, డిగ్రీ అర్హత సర్టిఫికేట్‌, ఆధార్‌కార్డు, ఓటరు ఐడీకార్డు లను జతచేసి సమర్పిస్తే ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం నుంచి ఓటు వేయడానికి అర్హత పొందుతారని సుభా్‌షగౌడ్‌ వివరించారు. ఈ ఎన్నిక సందర్భంగా త్వరలో తూంకుంట మున్సిపల్‌లో అర్హులైన పట్టభద్రులతో అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-09-21T06:42:56+05:30 IST