అగ్నికి ఆహుతైన ధాన్యం

ABN , First Publish Date - 2022-01-23T04:45:39+05:30 IST

మండలంలోని కొండపేటలో శనివారం ధాన్యం కూలిబూడిదయ్యాయి. బాధితుల కథనం మేరకు... గ్రామానికి చెందిన అడ్డాకుల దుర్గమ్మ, ఆదినారాయణ ఆరెకరాలు సాగుచేశారు.

అగ్నికి ఆహుతైన ధాన్యం
కాలిపోతున్న ధాన్యం


బూర్జ: మండలంలోని  కొండపేటలో శనివారం  ధాన్యం కూలిబూడిదయ్యాయి. బాధితుల కథనం మేరకు...  గ్రామానికి చెందిన అడ్డాకుల దుర్గమ్మ, ఆదినారాయణ ఆరెకరాలు సాగుచేశారు. రెండు రోజులుగా నూర్పిడి చేస్తున్నారు. ధాన్యం పోగువేసి ఇంటికి భోజనాలకు వెళ్లారు. ఇంతలో మధ్యాహ్నం చేనుకుప్పలకు నిప్పంటుకొని ధాన్యానికి వ్యాప్తించాయి.  విషయం తెలుసుకున్న పాలకొండ అగ్రిమాపక సిబ్బంది చేరి మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే ధాన్యం కాలిపోయాయి. అప్పుచేసి పంటలు వేశామని, అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


 



Updated Date - 2022-01-23T04:45:39+05:30 IST