ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-01-24T05:28:50+05:30 IST

కళ్లాల్లోనే అధికారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలి
మాట్లాడుతున్న రవికుమార్‌:

 టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు రవికుమార్‌

బూర్జ, జనవరి 23: కళ్లాల్లోనే అధికారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని తుడ్డలిలో  ఆయన విలేకరులతో  మా ట్లాడుతూ..స్పీకర్‌ సీతారాం మాటలు కోటలు దాటుతున్నా, చేతల్లో చూపించడంలేదని  విమర్శించారు. ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్మి అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులకు నిరాశే  మిగులుతోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు, మిల్లర్లు తూట్లు పొడుస్తున్నారన్నారు.కళ్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాల్సిన అధికారులు రైతు భరోసా కేంద్రాలకే పరిమితమయ్యారని విమర్శించారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ మాట్లాడుతూ.. రైతులు వారంరోజు లుగా ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నా ధాన్యం కొనుగోలుచేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణపతిరావు, కృష్ణ, రైతులు పాల్గొన్నారు. 


 


Updated Date - 2022-01-24T05:28:50+05:30 IST