ధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తి

ABN , First Publish Date - 2021-06-13T06:08:49+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తి చేసి నందున అధికారులను, సిబ్బందిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవా దాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అభి నందించారు.

ధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తి
మాట్లాడుతున్న మంత్రి అల్లోల

అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి అల్లోల, కలెక్టర్‌

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 12 : ధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తి చేసి నందున అధికారులను, సిబ్బందిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవా దాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అభి నందించారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అందరి సహకారంతో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని సంతోషం వ్యక్తం చేశా రు. కోవిడ్‌ నియంత్రణలో భాగంగా పటిష్టమైన చర్యలు చేపట్టి విజయం సాధించామని అన్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని, కేవలం 5 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ జిల్లాలో మొత్తం 14 నమోదు కాగా అందులో 4గురు చనిపోయారని 10 మంది రికవరీ అయ్యా రని, ప్రతీరోజు ఆసుపత్రికి వచ్చే రోగులు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే టీకాలు ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన డిజిటల్‌ భూ సర్వేలో భాగంగా నిర్మల్‌ జిల్లాకు సంబంధించి సోన్‌ మండల్‌ పాక్‌పట్ల గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ డిస్టిక్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ 35 శాతం పూర్తి చేయడం జరిగిందని, ఈ పనులు మందకోడిగా సాగుతున్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని, సెప్టెంబరు నెలలో లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుబంధు, రైషన్‌ కార్డులు, తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ, ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్‌లు హేమంత్‌, పి. రాంబా బు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-13T06:08:49+05:30 IST