నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-05-27T10:24:42+05:30 IST

జిల్లాలో ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారా

నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి

 అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ


పెద్దపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారా యణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికా రులు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సీజన్‌లో 3,41,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పె ట్టుకున్నామని, ఇప్పటివరకు 2,44,880 టన్నుల ధాన్యాన్ని కొనుగో లు చేశామన్నారు. రైతులకు 272 కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగు లు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని చివ రి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా మిల్లులకు త్వరత్వరగా తర లించేందుకు వాహనాలను సమకూర్చాలన్నారు. మిల్లుల వద్ద వెం టవెంటనే ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు సరిపడా హమాలీ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.


సెలవుదినాల్లో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు ధాన్యాన్ని విక్ర యించేటప్పుడు తమ వెంట ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, ప ట్టాదారు పాసుపుస్తకం తీసుకుని వస్తే త్వరగా చెల్లింపులు జరు గుతాయన్నారు. ఇప్పటివరకు నిర్ధేశించిన లక్ష్యంలో 83.5 శాతం ధాన్యాన్ని కొనుగోలుచేశామని, ఈనెలాఖరు వరకు మొత్తం ధా న్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ నర్సింహామూర్తి,జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం ప్రవీణ్‌ కుమార్‌, రైస్‌మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T10:24:42+05:30 IST