ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-05-18T07:08:21+05:30 IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తుఫాను రానున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అదనపు కాంటాలను ఏర్పాటు చేసి వేగవంతంగా కొనుగోలు చేసి, ఎగుమతి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
బస్వాపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ నిర్మల

 రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి

రామన్నపేట, మే17: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తుఫాను రానున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అదనపు కాంటాలను ఏర్పాటు చేసి వేగవంతంగా కొనుగోలు చేసి, ఎగుమతి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలకుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతున్నాయని ఆయ న విమర్శించారు. ధాన్యం ఎక్కువగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో కాంటా లను పెంచాలని, హమాలీల కొరత, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయనకోరారు. ఆయన వెంట సీపీఎం మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం నాయకులు బోయిని ఆనంద్‌, గన్నెబోయిన విజయభాస్కర్‌, సురేందర్‌రెడ్డి ఉన్నారు.

తహసీల్దార్‌కు వినతి

 రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం వ్యవసాయ మార్కె ట్‌లో ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యం తక్షణమే పంపించాలని రాష్ట్ర మైనార్టీ సెల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ జమీరుద్దీన్‌ అధికారులను కోరారు. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం రైతు ప్రభుత్వమని బంగారు తెలంగాణ అని కేసీఆర్‌, కేటీఆర్‌ అనడం సిగ్గు చేటని ఆయన అన్నారు. అనంతరం రామన్నపేట తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ జమీరుద్దీన్‌, బర్ల స్వామి, ఎండీ.ఎజాజ్‌, మహ్మద్‌ జాని, లోకేష్‌యాదవ్‌, ఇంతియాజ్‌, జమ్మి రాము, బంగారి వెంకన్న, మోటె స్వామి, బంగారి లక్ష్మమ్మ, ఈత బాలరాజు, ఎదుగాని రామస్వామి, కడగంచి జంగయ్య, మూటె భద్రయ్య, కల్లూరి నర్సింహ, ఆకలి లింగయ్య, కడగంచి రమేష్‌రాముడు పాల్గొన్నారు.

ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: ఎంపీపీ  

భువనగిరి రూరల్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంక టస్వామి యాదవ్‌ అన్నారు. సోమవారం భువనగిరి మండలం బస్వా పురంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. చివరి గింజ వరకు కొనుగోళ్లు చేయిస్తామని, రైతులు ఆందోళన చెంద వద్దని అన్నారు. కార్యక్రమంలో ముత్తిరెడ్డిగూడెం ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ, సర్పంచ్‌ మాకోలు సత్యం, ఏఈవో లావణ్య, వీబీకే కె  భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్‌ కె.వాణి, వార్డు సభ్యలు పాల్గొన్నారు. 

  రైతులకు వారంలో డబ్బులు చెల్లించాలి 

 ఆలేరు: వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, ఐకేపీ కేంద్రాల్లో రబీ వరి ధాన్యం విక్రయిస్తున్న రైతులకు ఆలసత్వం చేయకుండా వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లూరు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆలేరు వ్యవసాయ  మార్కెట్‌ యార్డులో జరుగుతు న్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వారు పరిశీలించారు.  ఆయన వెంట నాయకులు ంజనేయులు,  శ్రీనివాస రాజు పాల్గొన్నారు. 

కల్లాల వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలి 

ఆలేరు రూరల్‌: రైతులు తమ ధాన్యాన్ని కల్లాల వద్దనే ఆరబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ తెలిపారు. సోమవారం మండలంలోని కొలను పాకలో పీఏసీఎస్‌ ఆఽధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతున్నలు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవోద్దని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం తరలించి రైతులు సహకరించాలని ఆమె కోరారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో ఎస్‌ లావణ్య, ఏఈవో నిశిత్‌, మధు పాల్గొన్నారు. 

ప్రతిధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: బిక్షంరెడ్డి

రామన్నపేట : ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని పీఏసీఎస్‌ చైర్మన్‌ నంద్యాల భిక్షంరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్‌ సీఈవో జంగారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీరియల్‌ తప్పి కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తుండడంతో, రికార్డులను, టక్కు ఫీట్‌ను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మరికొన్ని అదనపు కాంటాలు వేసి వేగవం తంగా నిరంతరం కొనుగోలు జరిగేలా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుం టాన న్నారు.  ఆయన వెంట ఎంపీటీసీ గొరిగె నర్సింహ, రైతు సంఘం నాయ కులు కందుల హనుమంతు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T07:08:21+05:30 IST