ధాన్యం కొనుగోలు ఏజెన్సీలు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2022-01-21T05:57:22+05:30 IST

ధాన్యం కొనుగోలు ఏజన్సీలు సొసైటీల్లో అందుబాటులో ఉండి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ మురళి తెలిపారు.

ధాన్యం కొనుగోలు ఏజెన్సీలు అందుబాటులో ఉండాలి
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేసీ

తాళ్లూరు, జనవరి 20 : ధాన్యం కొనుగోలు ఏజన్సీలు సొసైటీల్లో అందుబాటులో ఉండి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ మురళి తెలిపారు. మండలంలోని శివరాంపురం, దోసకాయలపాడు వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలను, దోసకాయలపాడు గ్రామ సచివాలయాన్ని  జాయింట్‌ కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. రైతుభరోసా కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తున్న ఏజన్సీలకు జేసీ పలు సూచనలు చేశారు. తేమ శాతం కరెక్ట్‌గా నిర్థారించి  రైతు నష్టపోకుండా ధాన్యం సేకరించాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి మిల్లుకు తీసుక వెళ్లే సమయంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఖర్చులు, ఇతరత్రా ఇబ్బందులు వున్నాయా అన్న విషయాలపై నేరుగా రైతులతో మాట్లాడారు. బ్యాంక్‌ మిత్రలు రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండి అవగాహనలు కల్గించి  మంచి సేవలు చేయాలని సూచించారు. బ్యాంక్‌ మిత్రల సేవలను జేసీ ప్రశంశించారు. దోసకాయలపాడు సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయంలోని రికార్డులను, సిబ్బంది పరితీరు, మూమెంట్‌ రిజిస్టర్స్‌ను పరిశీలించారు. సిబ్బంది నిత్యం సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో వుండి సమస్యలను గుర్తించి నివేదించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పాలపర్తి బ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, వ్యవసాయాధికారి బి.ప్రసాద్‌రావు, ఏఈవోనాగరాజు, వీఆర్వోలు సుధాకర్‌, మూర్తి, విఏఏ రాజశేఖర్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

వివాదస్పద భూమి పరిశీలన

తాళ్లూరు : దోసకాయలపాడులో  సర్వే 391 భూమిని జాయింట్‌కలెక్టర్‌ జేవీ మురళి గురువారం పరిశీలించారు. ఆ నంబరులోని 34.30 ఎకరాల భూమి వివాదాస్పందంగా వుండి జేసీ కోర్డులో విచారణ జరుగుతోంది. దీంతో ఆయన ఆ భూమిని పరిశీలించారు. పూర్వం ఆభూమిని మానం నారాయణకు రైతువారి పట్టా ఇచ్చారు. తదనంతరం ఆభూమిని దోసకాయలపాడు గ్రామానికి చెందిన 41 మంది ఎస్సీ రైతులకు సాగుభూమి పట్టాలను ఇచ్చారు. దీంతో పూర్వ నుంచి రైతు వారిపట్టాహక్కు ఉన్న రైతు జేసీకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 22వ  తేదీ పట్టాలు పొందిన రైతులతో  జేసీ విచారణ జరిపేందుకు రెవెన్యూశాఖ నోటీసులు అందజేశారు. దోసకాయలపాడు  రైతుభరోసా కేంద్రం, గ్రామసచివాలయం తనిఖీకి వచ్చిన సందర్బంగా ఆభూమిని పరిశీలించారు. జేసీ వెంట తహసీల్థార్‌ పిబ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, ఆర్‌ఐలు ఇమ్మానియోల్‌రాజు,ప్రశాంత్‌, వీఆర్‌వోపీవిఎ్‌సఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:57:22+05:30 IST