ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-19T06:09:38+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పులఈశ్వర్‌ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మారం, ఏప్రిల్‌ 18: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పులఈశ్వర్‌ అన్నారు. ఆదివారం ధర్మా రం మండలం లంబాడితండ(బి) గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ రైతులకు రవాణాపరమైన సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ఆందోళన ధాన్యంను నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని అన్నారు. కొనుగోళ్లల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిమేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ మోహాన్‌రెడ్డి, సర్పంచ్‌ చంద్రానాయక్‌, రాష్ట్ర ఎస్టీసెల్‌ ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయక్‌, మార్కెట్‌ ఉపాధ్యక్షుడు గూడూరి లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T06:09:38+05:30 IST