కార్యాలయం లేని గ్రామ పంచాయతీ

ABN , First Publish Date - 2021-10-07T05:19:19+05:30 IST

రుద్రవరం మండలం చిలుకలూరును పంచాయతీగా సుమారు 50ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు.

కార్యాలయం లేని గ్రామ పంచాయతీ
చిలుకలూరు గ్రామం

  1. పాఠశాల భవనాల్లోనే సమావేశాలు 
  2. 50 ఏళ్ల కిందటి  పంచాయతీ దుస్థితి  


రుద్రవరం, అక్టోబరు 6: రుద్రవరం మండలం చిలుకలూరును పంచాయతీగా సుమారు 50ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిలుకలూరు గ్రామ జనాభా 773 మంది.  250 కుటుంబాలు ఉన్నాయి.  825 ఓటర్లు ఉన్నారు.  ఈ పంచాయతీకి ఎందరో సర్పంచ్‌లు మారారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. కానీ చిలుకలూరు గ్రామ పంచాయతీకి కార్యాలయ భవనాన్ని నిర్మించలేదు.  దీంతో  పంచాయతీ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు. అధికారుల సమీక్ష సమావేశాలు కూడా అక్కడే జరుగుతుంటాయి. ఇప్పటికీ ఇదే దుస్థితి. యాభై ఏళ్లలో సొంత భవనం లేని గ్రామ పంచాయతీ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసి ఉంటుందో ఊహించవచ్చు.  


 పూర్వం నుంచి ఇలాగే..

పూర్వం నుంచి పంచాయతీ సమావేశాలు  అరుగుపైన సమావేశాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పాఠశాల భవనంలో గ్రామ పంచాయతీ సమిక్షలు నిర్వహిస్తున్నారు. పూర్వ నుంచి ఇలాగే ఉంది. 

 - ఇస్మాయిల్‌, గ్రామస్థుడు, చిలుకలూరు 


పాఠశాల భవనంలోనే సమావేశం

పాఠశాల భవనంలోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాం. గ్రా మ పంచాయతీకి సొంత భవనం లేదు. నాకంటే ముందు పనిచేసిన కార్యదర్శులు కూడా ఈ పాఠశాలలోనే సమీక్షలు నిర్వహించారు.  

 - తులసి, గ్రామ కార్యదర్శి, చిలుకలూరు 


ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా

పూర్వం 50 ఏళ్ల నుంచి పంచాయతీ భవనం ఇక్కడ లేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తా. తన ఐదేళ్ల పరిపాలనలో పంచాయతీ భవనం నిర్మాణం చేపడతా. ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తా. 

 - ప్రసాదరెడ్డి, సర్పంచ్‌, చిలుకలూరు




Updated Date - 2021-10-07T05:19:19+05:30 IST