గ్రామాల్లో అభివృద్ధి నిరంతరం జరగాలి

ABN , First Publish Date - 2022-01-23T06:21:54+05:30 IST

గ్రామాల్లో అభివృద్ధి నిరంతరం జరగాలి

గ్రామాల్లో అభివృద్ధి నిరంతరం జరగాలి
సభలో మాట్లాడుతున్న ఎంపీ కనకమేడల, పాల్గొన్న ఎమ్మెల్సీ బచ్చుల ఆర్జునుడు, ఆళ్ల గోపాలకృష్ణ

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, జనవరి 22 : గ్రామాల్లో అభివృద్ధి నిరతరం జరుగుతుండాలని అప్పుడే ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు సమకూరతాయని రాజ్యసభ  సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. రంగన్న గూడెంలో శనివారం ఆర్‌ఆర్‌డీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చిన కోగంటి రాజబాబు మెమోరియల్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జును డుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాత్కా లిక ప్రయోజనాల పట్ల యువత ఆకర్షితులవకుండా దీర్ఘకా లిక ప్రయోజనం చేకూర్చే విధానాలు,అభివృద్ధిని పరిగణ లోకి తీసుకోవాలని ఆయన సూచించారు. రాజకీ యాలతో కలుషితమైన ప్రస్తుత గ్రామీణ వాతావరణంలో రంగన్న గూడెం గ్రామస్తులు సమైక్యంగా గ్రామాభివృద్ధి కార్యక్రమా లు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఇటీవల నిర్మించిన శ్రీకృష్ణుడి దేవాలయంలో పూజలు నిర్వహించి, కూడలిలో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్‌ఆర్‌డీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినరల్‌ వాటర్‌ప్లాంట్‌, కంప్యూటరీ కరించిన పాలకేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహకార మందిస్తానని ప్రజల కు ఎంపీ హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోగంటి రాజాబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజాబాబు కుమార్తె, మాజీ సర్పంచ్‌ ఆళ్ల మణికృష్ణతో కలిసి 25 మంది మెరిట్‌ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. చదువుల్లో రాణిస్తూ ఉన్నతశిఖరాలు అధిరోహించాలని, స్వగ్రామానికి సహకారమందించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.  ఓటీఎస్‌, ఉద్యోగుల సమ్మె,   కేసినో గురించి మాట్లాడారు. గుడివాడలో కేసినో జరిగిన విషయం ప్రజలందరూ చూశారని, ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించడం తప్ప సరైన సమాధానం చెప్పలేకపోవడం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామని, ఇంతనీచ, విధ్వేష పూరిత రాజకీయాలను ఇంతవరకూ చూడలేదన్నారు. ఆర్‌ఆర్‌డీఎస్‌ ద్వారా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సహకారమందిస్తున్న ఎన్నారైల గురించి కార్యదర్శి ఆళ్ల గోపాలకృష్ణ వివరించారు.  అనంతరం రవీం ద్రకుమార్‌, బచ్చుల అర్జునుడును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తుమ్మల రాంబాబు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శులు గుండపనేని ఉమావరప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ,  గుజ్జర్లమూడి బాబూరావు, ఆర్‌ఆర్‌డీఎస్‌ అధ్యక్షుడు తుమ్మలదశరధరామయ్య, మాజీ సర్పంచ్‌ మైనేని గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:21:54+05:30 IST