మక్కాలో ముగిసిన social distancing నిబంధన...భుజం భుజం కలిపి నమాజ్

ABN , First Publish Date - 2021-10-18T17:44:34+05:30 IST

సౌదీ అరేబియాలోని ముస్లిముల పవిత్ర నగరమైన మక్కాలోని గ్రాండ్ మసీదు కరోనా మహమ్మారి అనంతరం తాజాగా భక్తులతో కిటకిటలాడింది....

మక్కాలో ముగిసిన social distancing నిబంధన...భుజం భుజం కలిపి నమాజ్

మక్కా: సౌదీ అరేబియాలోని ముస్లిముల పవిత్ర నగరమైన మక్కాలోని గ్రాండ్ మసీదు కరోనా మహమ్మారి అనంతరం తాజాగా భక్తులతో కిటకిటలాడింది. కరోనావైరస్ మహమ్మారి తగ్గిన తర్వాత మొదటిసారి భక్తులు భుజం భుజం కలిపి మక్కా మసీదులో నమాజ్ చేశారు.మక్కా మసీదులోని కాబా చుట్టూ సామాజిక దూరాన్ని నిర్దేశిస్తూ చేసిన మార్కింగ్ లను కార్మికులు తొలగించారు. మక్కాలోని మసీదులోకి భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తూ సౌదీఅరేబియా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కొవిడ్ మహమ్మారి తర్వాత మసీదులో పలు ఆంక్షలు విధించారు. సామాజిక దూరం పాటించడంతో పాటు పరిమితసంఖ్యలోనే భక్తులను అనుమతించారు. 


సామాజిక దూరం నిబంధనను ఎత్తివేసినా కాబా మసీదును సందర్శించే భక్తులు తప్పనిసరిగా కరోనా టీకాలు వేసుకోవడంతోపాటు మాస్కులు ధరించాలని మక్కా అధికారులు సూచించారు.ఉమ్రా తీర్థయాత్ర చేయాలనుకునే విదేశీయులకు కొవిడ్ టీకాలు వేయడం ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కొవిడ్ వల్ల రెండేళ్లుగా హజ్ యాత్ర పూర్తి స్థాయిలో చేపట్టలేదు.సౌదీ అరేబియాలో 5,47,000 కరోనావైరస్ కేసులు నమోదైనాయి. సౌదీలో కరోనా వల్ల 8,760 మంది మరణించారు. 


Updated Date - 2021-10-18T17:44:34+05:30 IST