ఇంటి పక్కనే ఉన్న గుడికి మనవడిని తీసుకెళ్లి మెట్లపై కూర్చున్న తాత.. అక్కడికక్కడే ఇద్దరూ మృతి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-12T06:09:38+05:30 IST

మ‌ృత్యువు ఎవరిని ఎక్కడ ఎలా కబళిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం కొందరు చనిపోయిన విధానం చాలా అకస్మాత్తుగా, అనుకోని విధంగా ఉంటుంది. అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. రాత్రి భోజనం తరువాత తన మనవడిని ఆడించడానికి బయటికి తీసుకెళ్లిన ఒక తాత అనుకోకుండా మృతి చెందాడు...

ఇంటి పక్కనే ఉన్న గుడికి మనవడిని తీసుకెళ్లి మెట్లపై కూర్చున్న తాత.. అక్కడికక్కడే ఇద్దరూ మృతి.. అసలేం జరిగిందంటే..

మ‌ృత్యువు ఎవరిని ఎక్కడ ఎలా కబళిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం కొందరు చనిపోయిన విధానం చాలా అకస్మాత్తుగా, అనుకోని విధంగా ఉంటుంది. అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. రాత్రి భోజనం తరువాత తన మనవడిని ఆడించడానికి బయటికి తీసుకెళ్లిన ఒక తాత అనుకోకుండా మృతి చెందాడు. ఇందులో దారుణం ఏమిటంటే ఆ పసివాడు కూడా తాతతోపాటు మరణించాడు.

రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో సీదడా గ్రామంలో నివసించే కిషన్ రాణా(52) తన మూడేళ్ల మనవడు సతీశ్‌ను ఆడించడానికి బయటికి తీసుకెళ్లాడు. సాధారణంగా పల్లె వాతావరణంలో అందరూ రాత్రి భోజనం తరువాత బయట కాసేపు తిరుగుతూ ఉంటారు. కిషన్ కూడా ఆ రోజు రాత్రి 8 గంటలకు తన మనడు సతీశ్‌ను ఎత్తుకొని ఇంటి బయటకొచ్చాడు. పక్కనే శివాలయం ఉండడంతో.. గుడి మెట్లపై మనవడిని ఆడిస్తూ కూర్చున్నాడు. కిషన్ రాణా కుటుంబ సభ్యుల ఇంట్లోనే ఉన్నారు. ఇంతో ఏదో పెద్ద శబ్దం వచ్చింది. కాసేపటి తరువాత కిషన్ రాణా ఇంటికి ఒక వ్యక్తి వచ్చి శివాలయం మెట్లపై కిషన్ చనిపోయాడు అంటూ చెప్పాడు.


కిషన్ రాణా కొడుకు, అతని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ గుడి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ జనం గుమిగూడారు. కిషన్ రాణా, పక్కనే పసివాడు సతీశ్ రక్తసిక్తమై పడి ఉన్నారు. ఇది ఎలా జరిగిందంటే.. 


కిషన్ రాణా శివాలయం మెట్లపై కూర్చొని ఉండగా పక్క రోడ్డు మీద నుంచి అదే సమయంలో వచ్చిన బోరింగ్ వేసే లారీ అదుపు తప్పింది. ఆ బోరింగ్ లారీ శివాలయం మెట్లమీదుగా దూసుకెళ్లింది. కిషన్ రాణా, అతని మనవడు సతీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బోరింగ్ లారీ నడుపుతున్న డ్రైవర్ కోసం ఆరా తీయగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. కిషన్ రాణా, సతీశ్ మృత దేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు.

Updated Date - 2021-11-12T06:09:38+05:30 IST