పాకిస్థాన్‌‌లో ఎంతో రాజకీయం జరుగుతుంది.. బాబర్ దాన్ని తట్టుకోవాలి: గ్రాంట్ ఫ్లవర్

ABN , First Publish Date - 2020-06-01T21:26:31+05:30 IST

గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీ-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్.. గత నెలలో పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు

పాకిస్థాన్‌‌లో ఎంతో రాజకీయం జరుగుతుంది.. బాబర్ దాన్ని తట్టుకోవాలి: గ్రాంట్ ఫ్లవర్

గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీ-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్.. గత నెలలో పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో అతనికి వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలు వచ్చాయి. అయితే స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న బాబర్.. పాకిస్థాన్ క్రికెట్‌లో ఉన్న రాజకీయాలను తట్టుకోవాలని పాకిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ అన్నారు. 


‘‘అతనికి క్రికెట్‌పై మంచి పట్టు ఉంది. కానీ, పాకిస్థాన్ క్రికెట్‌లో చాలా రాజకీయాలు జరుగుతాయి. ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. స్టార్ బ్యాట్స్‌మెన్‌ అయినా.. ఒకసారి ఓడిపోవడం మొదలైతే.. వచ్చే ఒత్తిడి బ్యాటింగ్ స్కిల్స్‌‌పై ప్రభావం చూపుతుంది. ఎంతో మంచి గొప్ప ఆటగాళ్లకు కెప్టెన్సీ కారణంగా ఎంతో ఒత్తిడి ఎదురుకున్నారు. కానీ, దాన్ని అధిగమిస్తేనే.. గొప్ప కెప్టెన్ అవుతారు. బాబర్ ఆ ఒత్తిడిని అధిగమిస్తాడని భావిస్తున్నా’’ అని గ్రాంట్ ఫ్లవర్ తెలిపారు. 

Updated Date - 2020-06-01T21:26:31+05:30 IST