‘లేఖ’తో కదిలారు!

ABN , First Publish Date - 2021-06-21T08:58:45+05:30 IST

ముఖ్యమంత్రికి లేఖ రాస్తే కానీ అధికారులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఏకంగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం.. పత్రికల్లో ఈ వార్త ప్రచురితం ..

‘లేఖ’తో కదిలారు!

తల్లి డెత్‌ సర్టిఫికెట్‌ మంజూరు.. 

నోషిత సమస్య పరిష్కరం

అల్లూరు, జూన్‌ 20: ముఖ్యమంత్రికి లేఖ రాస్తే కానీ అధికారులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఏకంగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం.. పత్రికల్లో ఈ వార్త ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై స్పం దించింది. తన తల్లి మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినా అధికారులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. విసిగిపోయి మానసికంగా కుంగిపోయానని.. చిన్నప్పుడే తండ్రికి దూరమైన తాను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నానంటూ.. సీఎం జగన్‌కు నెల్లూరు జిల్లా అల్లూరు నివాసి బిరదవోలు నోషిత(15) లేఖ రాసి రిజిస్టర్‌ పోస్టులో పంపిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదివారం పత్రికల్లో ఈ వార్త ప్రచురితం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గంటల వ్యవధిలోనే స్పందించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు డెత్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసి, 10 గంటలకు నోషిత నివాసానికి వెళ్లి అల్లూరు పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్‌ అందజేశారు.

Updated Date - 2021-06-21T08:58:45+05:30 IST