Abn logo
Oct 7 2021 @ 17:45PM

పవన్‌పై గ్రంథి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఏలూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మంత్రిని సన్నాసి అన్నాడు అంటే పవన్‌కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అని ధ్వజమెత్తారు. ‘‘రాజమండ్రిలో కానిస్టేబుల్స్‌ను తిట్టి అనంతపురంలో మా నాన్న కానిస్టేబుల్ అంటాడు. పవన్‌కల్యాణ్ 2 రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమే. పవన్‌కల్యాణ్ జనసైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారు’’ అని గ్రంథి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా పవన్‌పై శ్రీనివాస్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించడంలో ఆయన ముందువరుసలో ఉన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption