Abn logo
May 12 2021 @ 00:42AM

గ్రాన్యూల్స్‌ తుది డివిడెండ్‌ 75శాతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 75 పైసల (75 శాతం) తుది డివిడెండ్‌ను గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రకటించింది. గతంలో చెల్లించిన 75 శాతం మధ్యంతర డివిడెండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఏడాదికి 150 శాతం డివిడెండ్‌ చెల్లించినట్లవుతుందని కంపెనీ పేర్కొంది. 2020-21 చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.128 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో లాభం రూ.92 కోట్లతో పోలిస్తే 38 శాతం పెరిగినట్లు గ్రాన్యూల్స్‌ సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తెలిపారు. ఆదాయం కూడా 33 శాతం వృద్ధితో రూ.600 కోట్ల నుంచి రూ.799 కోట్లకు పెరిగింది. మొత్తం ఏడాదికి రూ.3238 కోట్ల ఆదాయంపై (25 శాతం వృద్ధి)  రూ.549 కోట్ల లాభం (64 శాతం వృద్ధి) ఆర్జించింది. 

Advertisement
Advertisement
Advertisement