Abn logo
Aug 1 2021 @ 01:01AM

ఈ ఏడాది గ్రాన్యూల్స్‌ పెట్టుబడులు రూ.400 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి మూడు నెలలకు రూ.160 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మరోవైపు 8-10 ఔషధాలను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు 2021-22లో అబ్రివియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్లను దాఖలు చేయాలని కంపెనీ భావిస్తోంది. వీటి మొత్తం మార్కెట్‌ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. వచ్చే రెండు మూడేళ్లలో ప్రధాన ఉత్పత్తుల విక్రయాలు 10ు చొప్పున, నాన్‌ కోర్‌ ఔషధాల విక్రయాలు 50% చొప్పున పెరగగలవని చెబుతోంది. ఈ  కాలంలో నికర లాభం 20 ు వృద్ధి చెందగలదని, ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునే వీలుందని పేర్కొంది.


2025 నాటికి జీనోమ్‌ వ్యాలీ యూనిట్‌ 

హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో నిర్మిస్తున్న యూనిట్‌ 2024-25 నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. కాగా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నికర రుణం రూ.700-750 కోట్లు ఉండొచ్చని భావిస్తోంది.  అలాగే ఆర్‌ అండ్‌ డీపై రూ.140-150 కోట్లు ఖర్చు చేయాలని కంపెనీ  భావిస్తోంది. పారాసిటమాల్‌, ఇబుప్రోఫెన్‌, మెట్‌ఫార్మిన్‌ తదితర ఔషధాలను గ్రాన్యూల్స్‌ తయారు చేస్తోంది. కంపెనీ అమ్మకాల్లో పారాసిటమాల్‌ వాటా దాదాపు 36 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పారాసిటమాల్‌ తయారీకి అవసరమైన కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌ (కేఎస్‌ఎం) కొరతను కంపెనీ ఎదుర్కొంది. అయితే.. రానున్న కాలంలో స్థానిక సరఫరాదారుల నుంచి  పారాసిటమాల్‌ కేఎ్‌సఎం సరఫరాలు మెరుగు పడే వీలుందని, చైనా నుంచి కూడా సరఫరా పెరిగే వీలుందని కంపెనీ పేర్కొంది.