ముస్లిమ్ శ్మశానవాటికలకు తాళం

ABN , First Publish Date - 2020-04-10T14:03:27+05:30 IST

నగరంలో ముస్లింలు శ్మశాలవాటికలకు వెళ్లకుండా వాటికి తాళం వేశారు....

ముస్లిమ్ శ్మశానవాటికలకు తాళం

లక్నో (ఉత్తరప్రదేశ్): కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో షబ్బే బరాత్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ముస్లింలు శ్మశాలవాటికలకు వెళ్లకుండా వాటికి తాళం వేశారు. షబ్బేబరాత్ సందర్భంగా ముస్లింలు తమ పూర్వీకులను ఖననం చేసిన శ్మశానవాటికలకు వచ్చి వారి ఆత్మశాంతికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. లాక్ డౌన్ విధించడంతో ముస్లింలు రాకుండా లక్నో నగరంలోని 25 పెద్ద శ్మశానవాటికలకు తాళాలు వేసి మూసివేశారు.


లక్నో నగరంలోని ఐష్ బాగ్, హైదర్ గంజ్, ఖలా బజార్, టాల్కాటోరా, ఆలంబాగ్ ఖద్రా, దాలీగంజ్, దాదామియాన్ సదర్, నిషత్ గంజ్, ఖుర్రాం నగర్, బులాకీ అడ్డా, ఉజారియాన్, గోమతినగర్ ప్రాంతాల్లోని ముస్లిమ్ శ్మశానవాటికలకు తాళాలు వేసి తాత్కాలికంగా మూసి వేశారు. షబ్బేబరాత్ సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని, మసీదులు, శ్మశానవాటికలకు రావద్దని ముస్లిం మతాధికారులు మౌలానా ఖాలిద్ రషీద్, మౌలానా అబ్దుల్ ఇర్ఫాన్ లు సూచించారు.కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో శ్మశానవాటికలు, మసీదుల వద్ద రావద్దంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-04-10T14:03:27+05:30 IST