Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సం

మొదటి విరాళం అందించి, ప్రారంభించిన కలెక్టర్‌ మల్లికార్జున 

ఎన్‌సీసీ క్యాడెట్లు హుండీతో వస్తే విరాళాలివ్వాలని పిలుపు  

మహారాణిపేట, డిసెంబరు 7:  సైనికుల దేశభక్తి, ధైౖర్య సాహసాలు, త్యాగాలను గుర్తించి, దేశం గర్విస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు మంగళవారం కలెక్టరేట్‌లో సాయుధదళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్‌ మొదటి విరాళాన్ని అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయుధ దళాలు ఎన్నోసవాళ్లను ఎదుర్కొంటూ వీరోచితమైన సేవలందిస్తున్నాయని, వారికి జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు. సైనికుల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించాలని జిల్లా వాసులకు, పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ విరాళాలకు ఆదాయను పన్ను రాయితీ ఉంటుందని తెలిపారు. హుండీలతో వచ్చే ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు భారీగా విరాళాలందించాలని పిలుపునిచ్చారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి విశాఖపట్నంకు డీడీ రూపంలోనూ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సూర్యాబాగ్‌ అకౌంట్‌ నంబర్‌ 62078532988 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 0020282కు కూడా విరాళాలను అందజేయవచ్చని తెలిపారు. 

Advertisement
Advertisement