ఘనంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-15T04:46:52+05:30 IST

టేక్మాల్‌ మండల పరిధి అచ్చన్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను గురువారం అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
టేక్మాల్‌ మండలం అచ్చన్నపల్లిలో దుర్గామాతను దర్శించుకుంటున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

టేక్మాల్‌/నర్సాపూర్‌/శివ్వంపేట/పెద్దశంకరంపేట/చిన్నశంకరంపేట/హవేళీఘణపూర్‌/కౌడిపల్లి, అక్టోబరు 14 : టేక్మాల్‌ మండల పరిధి అచ్చన్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను గురువారం అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. అనంతరం నిర్వహించిన అన్నదానంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జోగిపేట మార్కెట్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినా్‌షకుమార్‌, భాస్కర్‌, నాయికోటి భాస్కర్‌, సర్పంచ్‌ కవితాఅశోక్‌, ఉపసర్పంచ్‌ మల్లేశం, సీనియర్‌ నాయకులు రాజాగౌడ్‌, పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలకృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, సర్దార్‌, ప్రజలు పాల్గొన్నారు. నర్సాపూర్‌లోని ధర్మశాలలో హిందువాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. వారి వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయిమోద్దీన్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, కౌన్సిలర్లు అశోక్‌గౌడ్‌, సరితఅంజనేయులుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ఏఎంసీ డైరెక్టర్‌ సురారం నర్సింహులు, బీజేపీ నాయకులు వాల్దా్‌సమల్లేశ్‌గౌడ్‌, అంజిగౌడ్‌ పాల్గొన్నారు. శివ్వంపేట మండలంలోని అల్లీపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను బీజేపీ రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి, వాల్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌ దర్శించుకున్నారు. వారి వెంట సర్పంచ్‌ సుగుణశ్రీనివాస్‌ పాల్గొన్నారు. శివ్వంపేట మండలం చండి గ్రామంలోని చండికాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. గురువారం మహా చండిహోమం నిర్వహించారు. 8వ రోజు  అమ్మవారు మహిశాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. జడ్పీటీసీ మహే్‌షగుప్తా, సర్పంచ్‌ ఉమాఅనిల్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్దశంకరంపేట మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గడికోటలో, తిరుమలాపూర్‌లో, విగ్రాం రామాగౌడ్‌ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలలో అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సర్పంచ్‌ అలుగుల సత్యనారాయణ, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు చందంపేట, అంబాజిపేట, టీమాందాపూర్‌, గవ్వలపల్లి, మడూర్‌, శాలిపేట, మిర్జాపల్లి, జంగరాయి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. చిన్నశంకరంపేటలో అమ్మవారికి ఎంపీటీసీ రాధిక, మాజీ సర్పంచ్‌ కుమార్‌గౌడ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మడూర్‌లో అమ్మవారి ఆలయం వద్ద దీపారాధన పూజలు నిర్వహించారు. ఎంపీపీ భాగ్యలక్ష్మి పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హవేళీఘణపూర్‌ మండలంలోని ఫరీద్‌పూర్‌ గ్రామంలో అమ్మవారికి ఉదయం కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి గురువారం కౌడిపల్లి మండలంలోని తునికీ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సంగారెడ్డి జిల్లాలో 

సదాశివపేట/కల్హేర్‌/నారాయణఖేడ్‌, అక్టోబరు 14 : సదాశివపేట పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్థానిక గాంధీచౌక్‌ వద్ద జై భవానీ యూత్‌ నెలకొల్పిన దుర్గామాత గురువారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. దుర్గామాత వద్ద ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు, 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కల్హేర్‌ మండల పరిధిలోని బల్కంచెల్క భక్తిదాంతండాలోని ప్రఖ్యాత విశ్వపాలిని జ్వాలాముఖి భవానీమాత అమ్మవారు గురువారం శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో 41 రోజులపాటు దీక్ష చేపట్టిన 65 మంది భవానీ దీక్షాధారులచే మాల విరమణను కొండాపూర్‌ పీఠాధిపతి సంగ్రామ్‌ మహరాజ్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయాల ధర్మకర్త, మేడ్చల్‌ జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ మూడ్‌ కిషన్‌సింగ్‌, స్థానిక సర్పంచ్‌ లలిత, నిర్వాహకులు రాములు, రూప్‌సింగ్‌, శంకర్‌, సవాయిసింగ్‌, భక్తులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలోని దుర్గాభవానీ మాత ఆలయ ఆవరణలో పెద్దలక్ష్మణ్‌ కుమారుడైన దివంగత దారం ప్రవీణ్‌ జ్ఞాపకార్థం శివాజీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు దుస్తుల పంపిణీ చేపట్టారు. టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ దారంశంకర్‌ చిన్నారులకు దుస్తులను అందజేశారు. అంతకుముందు మండపంలో అమ్మవారికి పూజలు చేశారు. 

Updated Date - 2021-10-15T04:46:52+05:30 IST