మహా ఇసుక క్వారీల జాతర

ABN , First Publish Date - 2021-04-18T06:01:57+05:30 IST

మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా మంజీరలో ఇసుక క్వారీ లకు టెండర్‌లు నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ముగిశాయి. నాం దేడ్‌ జిల్లా పరిధిలోని మంజీరలో దెగ్లూర్‌, బిలోలి, ధర్మాబాద్‌, తాలూకలలో 18 ఇసుక క్వారీలకు టెండర్ల నిర్వహించారు. ప్రభుత్వ ఇసుక క్వారీలు కా కుండా ప్రైవేటు ఇసుక క్వారీలు సైతం అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

మహా ఇసుక క్వారీల జాతర

నాందేడ్‌ జిల్లాలో 18 క్వారీలకు ముగిసిన టెండర్లు

కరోనా నేపథ్యంలో నిలిచిన ఇసుక రవాణా

బోధన్‌, ఏప్రిల్‌ 17: మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా మంజీరలో ఇసుక క్వారీ లకు టెండర్‌లు నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ముగిశాయి. నాం దేడ్‌ జిల్లా పరిధిలోని మంజీరలో దెగ్లూర్‌, బిలోలి, ధర్మాబాద్‌, తాలూకలలో 18 ఇసుక క్వారీలకు టెండర్ల నిర్వహించారు. ప్రభుత్వ ఇసుక క్వారీలు కా కుండా ప్రైవేటు ఇసుక క్వారీలు సైతం అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. దెగ్లూర్‌ పరిధిలోని షెట్లూర్‌, బోలేగావ్‌, బిలోలి, ధర్మాబాద్‌ తా లూక పరిధిలోని కార్లా, గంజీగావ్‌, బోలేగావ్‌, హునుగుంద, మాచ్‌నూర్‌ ఇ సుక క్వారీలకు టెండర్లు నిర్వహించింది. 

ఇక నుంచి ఇసుక జాతర..

మంజీరలో మహా ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించడంతో ఇసుక జాతర కొనసాగనుంది. ఏటా మంజీరలో మహారాష్ట్ర భూభాగంలో ఇసుక నిల్వలు ఉన్న లేకున్నా మహారాష్ట్ర ప్రభుత్వ ఇసుక టెండర్‌లు నిర్వహించ డం తవ్వకాలు చేపట్టడం జరుగుతోంది. తాము టెండర్లు నిర్వహించిన చో ట నిల్వలు లేకపోతే సరిహద్దులు దాటి తవ్వకాలు చేపట్టడం మహారాష్ట్ర ఇసుక క్వారీల నిర్వాహకులకు పరిపాటిగా మారింది. ఈ ఏడాది ఇసుక క్వా రీలకు టెండర్‌లు ముగిసి నెల రోజులు గడిచిపోతున్నా క్వారీలు మొదలవ్వ లేదు. కొవిడ్‌ నేపథ్యంలో మహారాష్ట్రలో ఇసుక క్వారీలు ఎక్కడికక్కడ నిలి చిపోయాయి. మరోవైపు మహారాష్ట్ర ఇసుక క్వారీల జాతర మంజీరలో మొ దలవుతే సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి రానుంది. 20 ఏళ్లుగా మంజీర లో సరిహద్దు వివాదం తేలడం లేదు. ఇప్పటికే నాందేడ్‌, నిజామాబాద్‌ జి ల్లాల కలెక్టర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిగి సరిహద్దు ల సర్వేకు పూనుకున్న మహారాష్ట్ర యంత్రాంగం సర్వేకు సహకరించకపోవ డంతో మున్నాళ్ల ముచ్చటగానే మారుతుంది. 


Updated Date - 2021-04-18T06:01:57+05:30 IST