Advertisement
Advertisement
Abn logo
Advertisement

జ్యోతిరావుఫూలేకి ఘన నివాళి

కోవూరు, నవంబరు 28 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే 131వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నేతలు వేరువేరుగా నివాళులర్పి ంచారు.  తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సమ సమాజం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు. కులమత వివక్ష లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి, అందించిన సిద్ధాంతం మన దేశంలో అనేక పునాదులు వేశాయన్నారు. ఫూలే ఆశయ సాధనకు  టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నాడని అన్నారు. సమ సమాజం  కోసం  యువ నాయకుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు ఆధ్వర్యంలో పోరాడతామని తెలిపారు. పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ కుల, లింగ వ్యవస్ధలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి తరం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధికార ప్రతినిధి చెముకుల కృష్ణచైతన్య, మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు పంది రఘురామ్‌, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముసలి సుధాకర్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బెల్లంకొండ విజయ్‌, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మహేష్‌, పడుగుపాడు పట్టణ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసులు, గుంజి మస్తాన్‌, పార్లమెంటు కార్యదర్శి చెక్క మదన్‌, నియోజకవర్గ బీసీ సెల్‌ కార్యదర్శి పాలూరి వెంకటేశ్వర్లు, బుచ్చిరెడ్డిపాలెం  కౌన్సిలర్‌ జుగుంట యాస్‌ పాల్గొన్నారు. 

కొడవలూరు:  మండలంలోని పీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి మహాత్మా జ్యోతిరావుఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి   నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులం పేరుతో  తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసి దేశంలో మొట్ట మొదటి మహాత్మా అని బిరుదు పొందిన మహోన్నతుడు  జ్యోతిరావుఫూలే అన్నారు. బడుగు బలహీన వర్గాలు, జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేస్తున్న నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు కరకటి మల్లికార్జున, నాసిన ప్రసాద్‌, జగదీష్‌ పాల్గొన్నారు. 

పొదలకూరు : స్థానిక నెల్లూరు రోడ్‌లోని బీసీ భవన్‌లో జ్యోతిరావుఫూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  నాయకులు ఊకోటి లక్ష్మీనారాయణ మా ట్లాడుతూ ఫూలే అంటరానితనం, కుల నిర్మూనతో పాటు మహిళోద్ధరణతి కోసం ఉద్యమించారన్నారు. కార్య క్రమంలో గోమసాని (శ్రీరస్తు) వేణు     బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు పముజుల శంకరయ్య, చొప్పా వెంకటేశ్వర్లు, బత్తూరి మురళీ, పూజల ప్రభాకర్‌, ఫారెస్ట్‌ మస్తానయ్య, మాడా రాధాకృష్ణ, రిటైర్డ్‌ ఉద్యోగులు సిద్ధయ్య మస్తాన్‌, కారంపొడి మోహన్‌, మోడుబోయిన రాకేష్‌ పాల్గొన్నారు. 

వెంకటాచలం : మండలంలోని గొలగమూడి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం  పూలే వర్ధంతి వేడుకలను నిర్వహించారు.  జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు కొండలరావు  పాల్గొన్నారు.


Advertisement
Advertisement