ఘనంగా ఉగాది పండుగ

ABN , First Publish Date - 2021-04-14T05:38:26+05:30 IST

ప్లవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని ప్రజలు ఆనందకరంగా వేడుకలు నిర్వహించుకున్నారు.

ఘనంగా ఉగాది పండుగ
దేవుని కడప ఆలయంలో టెంకాయలు కొడుతున్న ముస్లిం మహిళలు

దేవుని కడపలో పూజలు చేసిన ముస్లింలు


కడప (మారుతీనగర్‌), ఏప్రిల్‌ 13 : ప్లవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని ప్రజలు ఆనందకరంగా వేడుకలు నిర్వహించుకున్నారు. పలు ఆలయాలలో భక్తులు పూజలు చేశారు. ఆలయాలలో పంచాంగశ్రవణం వినిపించి భక్తులకు ఉగాది పచ్చడి అందచేశారు. దేవుని కడప వేంకటేశ్వరాలయంలో ఆనవాయితీగా ముస్లిం మహిళలు అమ్మవారికి పుట్టింటి సారెను అందజేశారు. బీబీ నాంచారమ్మను ఆడపడుచుగా భావించి ముస్లింలు సారెను అమ్మవారికి అందించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా ఆలయంలో పలువురు పూజలు చేశారు.


Updated Date - 2021-04-14T05:38:26+05:30 IST