గ్రేటర్ రిజల్ట్స్.. మినిట్ టూ మినిట్..

ABN , First Publish Date - 2020-12-04T14:08:33+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం ఎవరిది..?..

గ్రేటర్ రిజల్ట్స్.. మినిట్ టూ మినిట్..

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో ఎంఐఎం పార్టీ నిలిచింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.  మొత్తం 150 డివిజన్లకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఆయా పార్టీల అభ్యర్థులు గెలవడంతో సంబురాలు జరుపుకున్నారు. గెలిచిన బీజేపీ అభ్యర్థులతో కలిసి భాగ్య లక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 


గ్రేటర్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చేశాయ్..

Dec 4 2020 @ 08:38AM

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినప్పట్నుంచి జనాలు టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు. అందరూ  అనుకున్నట్లుగానే తొలి రౌండ్ ఫలితం 11 గంటలకు వచ్చేసింది. 




తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉండగా టీఆర్ఎస్ మాత్రం రెండో స్థానానికి పడిపోయింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,926 కాగా.. ఇందులో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లలేదు. ఇంకా 34 లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఆర్సీపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో బీజేపీ.. అధికార టీఆర్ఎస్‌కు అందని స్పీడ్‌లో దూసుకెళ్లినప్పటికీ ‘కారు’ పార్టీనే తొలి రౌండ్‌లో లీడ్‌లో ఉంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్లిన బీజేపీ అదే ఊపును తొలి ఫలితం వరకూ కంటిన్యూ చేయలేకపోయింది.


పోస్టల్ బ్యాలెట్: భారతీనగర్ బీజేపీ 4, టీఆర్ఎస్ 3, నోటా 1, చెల్లనివి 3

పోస్టల్ బ్యాలెట్: బోయిన్‌పల్లి డివిజన్ టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్లనివి 2

పోస్టల్ బ్యాలెట్: హైదర్‌నగర్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: గచ్చిబౌలి డివిజన్ బీజేపీ 5, టీఆర్ఎస్ 3

పోస్టల్ బ్యాలెట్: శేరిలింగంపల్లి టీఆర్ఎస్ 5, బీజేపీ 3

పోస్టల్ బ్యాలెట్: చంపాపేట్ డివిజన్ బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: పటాన్‌చెరు డివిజన్ టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: సురారం డివిజన్ టీర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 2

పోస్టల్ బ్యాలెట్: రంగారెడ్డి డివిజన్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: జీడిమెట్ల బీజేపీ 6, టీఆర్ఎస్ 4, చెల్లనివి 1

పోస్టల్ బ్యాలెట్: వనస్థలిపురం బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: హస్తినపురం బీజేపీ 2, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: లింగోజిగూడ బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: చింతల్ డివిజన్ బీజేపీ 2, చెల్లనివి 2






పోస్టల్ బ్యాలెట్: సుభాష్‌నగర్ టీఆర్ఎస్ 9, బీజేపీ 3, చెల్లనివి 2

పోస్టల్ బ్యాలెట్: రామంతపూర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 2

పోస్టల్ బ్యాలెట్: ఉప్పల్ డివిజన్ బీజేపీ 10, కాంగ్రెస్ 4

పోస్టల్ బ్యాలెట్: జగద్గిరిగుట్ట బీజేపీ 1, టీఆర్ఎస్ 1, చెల్లనివి 3

పోస్టల్ బ్యాలెట్: మన్సూరాబాద్ బీజేపీ 8, టీఆర్ఎస్ 6, చెల్లనివి 5

పోస్టల్ బ్యాలెట్: నాగోల్ డివిజన్ బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: కవాడిగూడ బీజేపీ 10, టీఆర్ఎస్ 1, టీడీపీ 1



పోస్టల్ బ్యాలెట్: బీఎన్‌రెడ్డి నగర్ టీఆర్ఎస్ 10, బీజేపీ 9

పోస్టల్ బ్యాలెట్: హయత్‌నగర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: బేగంబజార్ బీజేపీ 6, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2

పోస్టల్ బ్యాలెట్: గాంధీనగర్ బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: మియాపూర్ బీజేపీ 1, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, చెల్లనివి 1

పోస్టల్ బ్యాలెట్: హఫీజ్‌పేట్ బీజేపీ 4

పోస్టల్ బ్యాలెట్: చందానగర్ బీజేపీ 2, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2

పోస్టల్ బ్యాలెట్: చిలకానగర్ డివిజన్ బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: సరూర్‌నగర్ టీఆర్ఎస్ 2, బీజేపీ 1, కాంగ్రెస్ 1, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: ఆర్సీ పురం బీజేపీ 4, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: కొత్తపేట డివిజన్ బీజేపీ 8, టీఆర్ఎస్ 4

పోస్టల్ బ్యాలెట్: చైతన్యపురి బీజేపీ 2, టీఆర్ఎస్ 1, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: గడ్డిఅన్నారం బీజేపీ 10, టీఆర్ఎస్ 2, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: అమీర్‌పేట్ టీఆర్ఎస్ 3, బీజేపీ 1

పోస్టల్ బ్యాలెట్: సనత్‌నగర్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: సోమాజిగూడ బీజేపీ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: ఖైరతాబాద్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1




పోస్టల్ బ్యాలెట్: గాజులరామారం బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: అల్వాల్‌ బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 6, నోటా 1, చెల్లనివి 23

పోస్టల్ బ్యాలెట్: అల్లాపూర్‌ డివిజన్‌ బీజేపీ 3

పోస్టల్ బ్యాలెట్: మూసాపేట్‌ బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: ఫతేనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: కేపీహెచ్‌బీ కాలనీ బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2

పోస్టల్ బ్యాలెట్: బాలాజీనగర్‌ డివిజన్‌ బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3

పోస్టల్ బ్యాలెట్: మాదాపూర్‌ బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: మూసాపేట బీజేపీ 15, టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: బాలానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2


పోస్టల్ బ్యాలెట్: బీఎన్‌రెడ్డి నగర్ టీఆర్ఎస్ 10, బీజేపీ 9

పోస్టల్ బ్యాలెట్: హయత్‌నగర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: బేగంబజార్ బీజేపీ 6, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2

పోస్టల్ బ్యాలెట్: గాంధీనగర్ బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: మియాపూర్ బీజేపీ 1, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, చెల్లనివి 1

పోస్టల్ బ్యాలెట్: హఫీజ్‌పేట్ బీజేపీ 4

పోస్టల్ బ్యాలెట్: చందానగర్ బీజేపీ 2, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2


పోస్టల్ బ్యాలెట్: చిలకానగర్ డివిజన్ బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: సరూర్‌నగర్ టీఆర్ఎస్ 2, బీజేపీ 1, కాంగ్రెస్ 1, నోటా 1

పోస్టల్ బ్యాలెట్: ఆర్సీ పురం బీజేపీ 4, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: కొత్తపేట డివిజన్ బీజేపీ 8, టీఆర్ఎస్ 4

పోస్టల్ బ్యాలెట్: చైతన్యపురి బీజేపీ 2, టీఆర్ఎస్ 1, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: గడ్డిఅన్నారం బీజేపీ 10, టీఆర్ఎస్ 2, టీడీపీ 1


పోస్టల్ బ్యాలెట్: అమీర్‌పేట్ టీఆర్ఎస్ 3, బీజేపీ 1

పోస్టల్ బ్యాలెట్: సనత్‌నగర్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: సోమాజిగూడ బీజేపీ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: ఖైరతాబాద్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1

పోస్టల్ బ్యాలెట్: గాజులరామారం బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: అల్వాల్‌ బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 6, నోటా 1, చెల్లనివి 23

పోస్టల్ బ్యాలెట్: అల్లాపూర్‌ డివిజన్‌ బీజేపీ 3


పోస్టల్ బ్యాలెట్: మూసాపేట్‌ బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: ఫతేనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: కేపీహెచ్‌బీ కాలనీ బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2

పోస్టల్ బ్యాలెట్: బాలాజీనగర్‌ డివిజన్‌ బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3

పోస్టల్ బ్యాలెట్: మాదాపూర్‌ బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: మూసాపేట బీజేపీ 15, టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: బాలానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2







పోస్టల్ బ్యాలెట్: కాచిగూడ బీజేపీ 3, చెల్లనివి 3

పోస్టల్ బ్యాలెట్: హిమాయత్‌నగర్ టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: నల్లకుంట బీజేపీ 9, టీఆర్‌ఎస్‌ 2

పోస్టల్ బ్యాలెట్: బాగ్‌ అంబర్‌పేట్ బీజేపీ 10, టీఆర్‌ఎస్‌ 1

పోస్టల్ బ్యాలెట్: గోల్నాక బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: అంబర్‌పేట్ టీఆర్‌ఎస్‌ 17, బీజేపీ 12, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: జాంబాగ్ బీజేపీ 2

పోస్టల్ బ్యాలెట్: మంగల్‌హట్ బీజేపీ 3, టీఆర్ఎస్ 2, చెల్లనివి 5

పోస్టల్ బ్యాలెట్: దత్తాత్రేయ నగర్ ఎంఐఎం 1

పోస్టల్ బ్యాలెట్: గోషామహల్ బీజేపీ 1, కాంగ్రెస్ 1

పోస్టల్ బ్యాలెట్: గన్‌ఫౌండ్రీ టీఆర్‌ఎస్‌ 2






పోస్టల్ బ్యాలెట్: చర్లపల్లి డివిజన్‌ బీజేపీ 1, టీఆర్ఎస్ 0, కాంగ్రెస్‌ 0

పోస్టల్ బ్యాలెట్: మీర్‌పేట డివిజన్‌ బీజేపీ 4, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్‌ 2

పోస్టల్ బ్యాలెట్: మల్లాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 0, కాంగ్రెస్‌ 0

పోస్టల్ బ్యాలెట్: నాచారం డివిజన్‌ బీజేపీ 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్‌ 2

పోస్టల్ బ్యాలెట్: జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ 1, టీఆర్ఎస్ 1, టీడీపీ 1

పోస్టల్ బ్యాలెట్: వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ బీజేపీ 10, టీఆర్ఎస్ 0, టీడీపీ 2

పోస్టల్ బ్యాలెట్: షేక్‌పేట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 1, ఎంఐఎం 1

పోస్టల్ బ్యాలెట్: మెహదీపట్నం డివిజన్‌ బీజేపీ 25, టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 2


ఎంఐఎం 5, టీడీపీ 1, నోటా 1, రిజెక్ట్‌ 1

పోస్టల్ బ్యాలెట్: మల్కాజ్‌గిరి డివిజన్‌ బీజేపీ 5, రిజెక్ట్‌ 1

పోస్టల్ బ్యాలెట్: మౌలాలి డివిజన్‌ బీజేపీ 1, టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 1

పోస్టల్‌ బ్యాలెట్‌: బన్సీలాల్‌పేట్ డివిజన్‌ బీజేపీ 11, టీఆర్‌ఎస్‌ 2

రాంగోపాల్ పేట్ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 2, బీజేపీ, కాంగ్రెస్‌-0

బేగంపేట్‌ డివిజన్‌ బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 2, టీడీపీ 1

మొండా మార్కెట్ డివిజన్‌ బీజేపీ 9, టీఆర్‌ఎస్‌ 1

యూసుఫ్‌గూడా డివిజన్‌ బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 2

వెంగళరావునగర్‌ డివిజన్‌ బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 1, రిజెక్ట్‌ 1

పోస్టల్‌ బ్యాలెట్‌: బోరబండ డివిజన్‌ బీజేపీ 1

రహమత్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 1, కాంగ్రెస్‌ 2

పోస్టల్‌ బ్యాలెట్‌: ఎర్రగడ్డ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 1


టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటే...

Dec 4 2020 @ 12:02PM


హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలను దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినప్పట్నుంచి జనాలు టీవీలకు అతుక్కుపోయారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ దూసుకెళ్లినప్పటికీ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చే సరికి సీన్ మొత్తం మారిపోయింది. నిమిషానికోసారి ఆధిక్యాలు మారిపోతుండటంతో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కూడా 16 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు.. ఎంఐఎం ఒకే ఒక్క స్థానంలో.. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు దరిదాపుల్లో కూడా లేరు.


టీఆర్ఎస్ ఆధిక్యం ఉండే స్థానాలు..

ఆర్సీపురం 

పటాన్ చెరు

చందానగర్

హఫీజ్‌ఫేట్

హైదర్‌నగర్

జూబ్లీహిల్స్‌

ఖైరతాబాద్

ఓల్డ్ బోయిన్‌పల్లి

బాలానగర్

చర్లపల్లి

కాప్రా

మీర్‌పేట్-హెచ్‌బీ కాలనీ

శేరిలింగంపల్లి

గాజలరామారం

రంగారెడ్డి నగర్


బీజేపీ ఆధిక్యంలో ఉండే స్థానాలు..

బేగంబజార్

గోషామహల్

దత్తాత్రేయ నగర్

జాంబాగ్

గన్ ఫౌండ్రీ

మంగళ్ హట్


ఎంఐఎం ఆధిక్యంలో ఉండే స్థానాలు..

మెహదీపట్నం


గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి.. బోణి కొట్టింది ఈ పార్టీయే..

Dec 4 2020 @ 12:11PM


హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడిపోయింది. ఆది నుంచి ఎంఐఎం అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. చివరిగా ఎంఐఎం విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బోణి కొట్టింది. 




బోణీ కొట్టిన టీఆర్ఎస్.. రెండు స్థానాల్లో గెలుపు

Dec 4 2020 @ 12:29PM


హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునిత గెలుపొందారు. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఘన విజయం సాధించారు. అయితే ఎంత మెజార్టీతో గెలుపొందారనే దానిపై అధికారికంగా ఎన్నికల అధికారులు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం 21 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ-15 స్థానాల్లో, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో మాత్రం ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, సనత్‌నగర్‌తో పాటు పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుకు దగ్గరలో ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి.


గ్రేటర్ కౌంటింగ్ : బోణీ కొట్టిన కాంగ్రెస్ 

Dec 4 2020 @ 13:08PM


హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచి లీడింగ్‌లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు. అయితే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారనే దానిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. శిరీష గెలవడంతో స్థానికంగా కాంగ్రెస్ కార్యాలయం, ఆమె నివాసం వద్ద కార్యకర్తలు, అనుచరులు పటాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకా మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మునుపటి కంటే ఈసారి కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరో రెండు స్థానాల్లో ఎంఐఎం విజయం.. 

Dec 4 2020 @ 13:23PM


హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం ఎంఐఎంకు అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు చోట్ల కూడా ఎంఐఎం విజయం సాధించింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. కాగా.. డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్‌ఖాన్‌ విజయం సాధించగా.. కిషన్‌బాగ్‌లో కూడా ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మొబషీరుద్దీన్‌ విజయం సాధించారు. కాగా.. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసురి సునీత విజయం సాధించగా.. యూసుఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ పటేల్‌ విజయం సాధించారు. ఏఎస్‌రావునగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు.


డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మళ్లీ గెలుపు

Dec 4 2020 @ 13:59PM


హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఇంకా ఎక్కువే మెజార్టీతో గెలుపొందినట్లు తెలుస్తోంది. అయితే మెజార్టీ ఎంత అనే విషయం ఇంకా అధికారికంగా ఎలక్షన్ ఆఫీసర్లు వెల్లడించలేదు. గత ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసి ఘన విజయం సాధించి డిప్యూటీ మేయర్‌ పదవి దక్కించుకున్నారు.


సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల ముందంజ...

Dec 4 2020 @ 14:06PM


హైదరాబాద్: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి చైతన్యపురి డివిజన్‌లో 4 వేలకు పైగా.. గడ్డి అన్నారం డివిజన్‌లో 2800కి పైగా.. కొత్తపేట డివిజన్లో 3000కు పైగా.. ఆర్‌కే పురంలో రెండు వేలకు పైగా... సరూర్ నగర్ డివిజన్లో 2400కు పైగా ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే మొత్తానికి మాత్రం తొలిరౌండ్‌లో ‘కారు’ జోరును కొనసాగిస్తోంది. 



టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి వెనుకంజ.. దూసుకెళ్తున్న బీజేపీ

Dec 4 2020 @ 14:25PM


హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్థానాల్లో టీఆర్ఎస్ గెలవగా ప్రగతి భవన్‌లో కార్యకర్తలు, నేతలు, గెలిచిన అభ్యర్థుల అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చి.. పోటాపోటీగా ఉంది. అయితే కీలకమైన స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ వెనుకంజలో ఉండగా.. బీజేపీలో ముందంజలో ఉండటం గమనార్హం. దీంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.


దూసుకెళ్తున్న బీజేపీ


ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న హబ్సిగూడా 8వ డివిజన్ నుంచి పోటీ చేశారు. కీలకమైన ఈ డివిజన్‌లో ఎమ్మెల్యే సతీమణి వెనుకంజలో ఉండటం గమనార్హం. బీజేపీ అభ్యర్థి కంటే వెయ్యి ఓట్ల వెనుకంజలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ దూసుకెళ్తుండటంతో కార్యకర్తలు, అభ్యర్థి అనుచరులు ఫలితాన్ని ఎంతో ఆసక్తిగా ఫలితాన్ని చూస్తున్నారు. అయితే.. ఈ స్థానంలోనే కాకుండా గతంలో టీఆర్ఎస్ గెలిచిన పలు స్థానాల్లో కూడా ప్రస్తుతం బీజేపీ లీడింగ్‌లో ఉన్నది. మరికొన్ని స్థానాల్లో టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి.


బోణీ కొట్టిన బీజేపీ.. రెండు స్థానాల్లో గెలుపు

Dec 4 2020 @ 14:54PM


హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌లో మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో సత్తా చూపిన బీజేపీ.. ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. కొన్ని స్థానాల్లో అధికార టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టిగా పోటీ ఇచ్చింది. ఇంకా అదే కొనసాగుతోంది కూడా. తాజాగా బీజేపీ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. చైతన్యపురిలో బీజేపీ అభ్యర్థి రంగా నర్సింహ గుప్తా గెలుపొందారు. అధికార పార్టీ అభ్యర్థిపై 5 వేల మెజార్టీతో గుప్తా ఘన విజయం సాధించారు. చంపాపేటలోనూ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.


దూసుకెళ్తున్న స్థానాలు..

హబ్సిగూడ డివిజన్‌లో 500 ఓట్ల ఆధిక్యత

రామంతాపూర్‌లో 1000 ఓట్ల ఆధిక్యత

లింగోజిగూడలో 1692 ఓట్ల ఆధిక్యత

బేగంబజార్‌లో 3600 ఓట్ల ఆధిక్యత (శంకర్‌ యాదవ్)

మల్కాజ్‌గిరిలో 1300 ఓట్ల ఆధిక్యత

మూసాపేట్‌లో 463 ఓట్ల ఆధిక్యత

ముసారాంబాగ్‌లో 2,200 ఓట్ల మెజార్టీతో ముందంజ

మోండా మార్కెట్‌ డివిజన్‌లో 3 వేల ఓట్ల మెజార్టీతో ముందంజ

సైదాబాద్‌లో 200 ఓట్ల ఆధిక్యం



గెలిచిన భార్య.. ముద్దులతో అభినందించిన భర్త

Dec 4 2020 @ 14:49PM


సంగారెడ్డి: ఉత్కంఠభరితంగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కొన్నిచోట్ల భావోద్వేగ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న వారు సంబరాలు ప్రారంభించారు. కొంతమంది విజయం సాధించి.. విజయోత్సవాలు చేసుకుంటున్నారు. 112వ డివిజన్ రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 3459 ఓట్లతో పుష్ప విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆమె సంబరాల్లో మునిగిపోయారు. ఆనందోత్సాహంతో ఆమె భర్త నగేశ్ యాదవ్ ముద్దు పెట్టి అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పుష్ప... తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించి తనకు ఓటేశారని ఆమె అన్నారు. 


నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ

Dec 4 2020 @ 15:01PM


హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. టీఆర్ఎస్ 68, బీజేపీ 39, ఎంఐఎం 40, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. చాలా చోట్ల బీజేపీ గణనీయంగా ప్రభావం చూపించింది. టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ.. ఎక్కువ స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎంకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా హైదరాబాద్‌లో ప్రచారం చేయడంతో ఉత్తర ఇండియన్స్‌లో కొంత ప్రభావం చూపించింది.


టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం 

Dec 4 2020 @ 15:20PM 


హైదరాబాద్: టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ 70 స్థానాల్లో.. బీజేపీ 35, కాంగ్రెస్ 3, ఎంఐఎం 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. టీడీపీ ఇంతవరకు ఖాతా తెరవలేదు. గతంలో బీజేపీ నాలుగు స్థానాలు సాధించగా.. ఇపుడు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా బీజేపీకి ఇది ‘సెలబ్రేషన్ టైమ్ సెలబ్రేషన్ మోడ్’ అని చెప్పవచ్చు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇచ్చారు. 


గ్రేటర్‌లో టీఆర్ఎస్ జోరు.. అయితే.. 

Dec 4 2020 @ 15:35PM


హైదరాబాద్: గ్రేటర్‌లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఏ మాత్రం కనిపిండంలేదు. మరోవైపు టీఆర్ఎస్‌ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ చెమటలు పట్టించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.


ఆంధ్రా సెటిలర్లే గెలిపించారు: హైదర్ నగర్ విజేత నార్నే

Dec 4 2020 @ 16:44PM


హైదరాబాద్: నగరంలోని హైదర్ నగర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నే శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. 2010 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు గెలుపు సంబరాల్లో మునిగితేలారు. ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన .. తన విజయానందాన్ని పంచుకున్నారు. తనపై నమ్మకం పెట్టి గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రచారంలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై దృష్టి పెడతానన్నారు. కులమతాలకు, ప్రాంతలకు అతీతంగా తనకు ఓట్లు వేశారన్నారు. ఆంధ్రా సెటిలర్లే తనను గెలిపించారన్న ఆయన.. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. 


ఆ డివిజన్‌లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం

Dec 4 2020 @ 17:21PM


హైదరాబాద్: సరూర్ నగర్ డిబిజన్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సరూర్ నగర్, ఆర్ కె పురం, కొత్త పెట్, చైతన్యపురి, గడ్డి అన్నారంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 


ఆర్.కె.పురం


టిఆర్ఎస్........4972


బిజెపి ..........7245


కాంగ్రెస్...... 953


టీడీపీ.....220


బీజేపీ మెజార్టీ .. 2273




సరూర్ నగర్


టిఆర్ఎస్........5136


బిజెపి ..........7662


కాంగ్రెస్...... ....510


టీడీపీ.....252


బీజేపీ మెజార్టీ.....2526




కొత్తపేట


టిఆర్ఎస్........4741


బిజెపి ..........7339


కాంగ్రెస్......... 796


టీడీపీ.....649


బీజేపీ మెజార్టీ.....2598




చైతన్యపురి


టిఆర్ఎస్........4009


బిజెపి ..........8335


కాంగ్రెస్......... 682


టీడీపీ.....487


బీజేపీ మెజార్టీ.....4326




గడ్డిఅన్నారం


టిఆర్ఎస్........4042


బిజెపి ..........7426


కాంగ్రెస్......... 1913


టీడీపీ.....329


బీజేపీ మెజార్టీ.....3384


తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 15 ఎంపీ సీట్లు సాధిస్తాం: ధర్మపురి అర్వింద్

Dec 4 2020 @ 17:24PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమౌతోందని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, టీఆర్ఎస్ అధినాయకత్వంలో అహంకారం పతాక స్థాయికి చేరిందన్నారు. అందుకే ప్రజలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాకిచ్చారని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు తాజా ఫలితాలే నిదర్శనమన్నారు. మోదీపై, బీజేపీపై   ప్రజల్లో విశ్వాసం పెరుగుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి భయం పట్టుకుందన్నారు. 


కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం: రేవంత్ ఆరోపణ

Dec 4 2020 @ 17:28PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందిస్తూ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఓటమికి ఓటర్లు కారణం కాదని.. మీడియానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు మీడియాను ప్యాకేజీలతో మ్యానేజ్ చేశాయంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రచారం చేశారని చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ జెండా మోసిన కార్యకర్తలను రేవంత్‌ అభినందించారు.



కూకట్‌పల్లి సర్కిల్ క్లీన్ స్వీప్.. గులాబీ మయం

Dec 4 2020 @ 17:37PM


హైదరాబాద్: కూకట్‌పల్లి సర్కిల్‌ను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆరుకు ఆరు డివిజన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. 119 డివిజన్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహా యాదవ్ గెలుపొందారు. 120 డివిజన్ బాలానగర్‌లో ఆవుల రవీందర్ రెడ్డి 3748 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 121 డివిజన్‌ కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ 749 ఓట్లతో, 122వ డివిజన్ వివేకానంద నగర్‌లో మాధవరం రోజా రంగారావు, 123వ డివిజన్ హైదర్ నగర్‌లో నార్నే శ్రీనివాస్ రావు 2010 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 124వ డివిజన్ ఆల్విన్ కాలనీలో దొడ్ల వెంకటేష్ గౌడ్ 1208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 


ప్రజలు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు- ఎర్రబెల్లి

Dec 4 2020 @ 18:01PM


హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చి తమ అభిమానాన్నిచాటుకున్నారని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మీర్‌పేట్‌ డివిజన్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. తాను సమన్వయం చేసిన కాప్రా, మల్లాపూర్‌, నాచారం, రామంతాపూర్‌ తదితర డివిజన్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై మంత్రి స్పందిస్తూ ఓడిపోయిన ఒకటి రెండు స్ధానాలపై సమీక్ష చేసుకుంటామన్నారు. 


తనను మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌ ఇన్‌చార్జిగా నియమించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు, అభ్యర్ధిని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరు ఎన్నిరకాలుగా ప్రలోభ పెట్టినా, కుట్రలుచేసినా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రజల పార్టీగా గుర్తించారని చెప్పారు. పార్టీ అధినేత , ప్రత్యేక రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత సీఎం కేసీఆర్‌ తిరుగులేని మహానాయకుడని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ మరోసారి తన సత్తాచాటుకుందన్నారు. 


కార్పొరేటర్ సింధుకు ప్రగతిభవన్ నుంచి పిలుపు..!

Dec 4 2020 @ 18:41PM


హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి పేరు తెరపైకొచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చడం, మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా చేరుకోవడంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. భారతినగర్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలుపొందిన సింధుకు ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయుద్దీన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. బాబా ఫసీయుద్దీన్‌ బోరబండ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించారు.


మేయర్ పదవిని అధిష్టించే అవకాశం ఈసారి మహిళకు దక్కడంతో అధికార పార్టీ నుంచి గెలుపొందిన పలువురు మహిళా కార్పొరేటర్లు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన టీఆర్‌ఎస్ కీలక నేత, ఎంపీ కే కేశవ రావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేర్లు ఆశావహుల జాబితాలో ప్రధానంగా తెరపైకొచ్చాయి.


కవితకు గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని షాక్..!

Dec 4 2020 @ 19:06PM


హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని షాక్‌ తగిలింది. కవిత ఇన్‌చార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముఠా పద్మా నరేష్.. బీజేపీ అభ్యర్థి పావని చేతిలో ఓటమి పాలు కావడం టీఆర్‌ఎస్‌కు షాకిచ్చింది. ఈ ఒక్క స్థానంలో మాత్రమే కాదు.. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఇంచార్జ్‌లుగా ఉన్న చోట గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు.


మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అడిక్‌మెట్‌లో, మంత్రి సబిత ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్కే పురంలో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నట్లు తీవ్రంగా చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఆమె ఇంచార్జ్‌గా ఉన్న స్థానం నుంచి కార్పొరేటర్ అభ్యర్థి ఓడిపోవడం అధికార పార్టీకి మింగుడు పడని విషయమని చెప్పక తప్పదు. 


గ్రేటర్లు షాక్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా

Dec 4 2020 @ 19:11PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీకి ఓటర్లు పెద్ద షాకిచ్చారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమంటూ రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా ఒక పక్షాన్నే పని చేసిందంటూ వ్యాఖ్యానించారు.


కార్యకర్తల పోరాట ఫలితమే విజయం: బండి సంజయ్‌

Dec 4 2020 @ 19:27PM


హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కమలం జెండా రెపరెపలాండిది. కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఈ విజయంతో తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.  ఈ గెలుపు బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్‌ను నింపింది. బీజేపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..  కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే ఈ విజయానికి కారణమని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఎన్నికల కమిషనర్‌, డీజీపీలకు అంకితం ఇస్తున్నానని అనడం గమనార్హం. పోలీసులు, ఎంఐఎం కార్యకర్తలు ఎన్ని దాడులు చేసిన ప్రజలు బీజేపీ పక్షంగా ఉండి అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. 


గెలిచిన అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటా..


గెలిచిన బీజేపీ అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని పిలుపునిచ్చారు. ఫలితాల్లో  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యం సృష్టంగా కనిపించిందని చెప్పారు. సీఎం వ్యవహారశైలికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని.. వారందరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం


గ్రేటర్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Dec 4 2020 @ 19:46PM


హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, గ్రేటర్‌లో తమ పార్టీ బలం పుంజుకుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో తమకు సమయం సరిపోలేదని, లేకపోతే మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేవాళ్లమన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై తమకు సంతృప్తినిచ్చాయన్నారు. 

Updated Date - 2020-12-04T14:08:33+05:30 IST