గ్రేటర్‌కు ఆరుగురు బీజేపీ అధ్యక్షులు

ABN , First Publish Date - 2020-09-23T10:05:20+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌కు బీజేపీ ఆరుగురు అధ్యక్షులను నియమించింది. ఇంత వరకూ జిల్లాకు ఒక అధ్యక్షుడు

గ్రేటర్‌కు ఆరుగురు బీజేపీ అధ్యక్షులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌కు బీజేపీ ఆరుగురు అధ్యక్షులను నియమించింది. ఇంత వరకూ జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉండగా ఇప్పుడు ఏకంగా ఆరుగురిని నియమించి కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ ఎన్నికలు వస్తున్న సమయంలో బీజేపీ నలువైపులా అధ్యక్షులను నియమించి పార్టీ కార్యకలాపాలను వికేంద్రీకరించింది. హైదరాబాద్‌ జిల్లాను నాలుగు విభాగాలుగా, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను అర్బన్‌, రూరల్‌గా విడదీసి వేర్వేరుగా అధ్యక్షులను నియమించింది. మొదట బీజేపీ నగర శాఖగా ఉండేది, ఈ తరువాత గ్రేటర్‌కు విస్తరించారు, ఆ తరువాత మళ్లీ నగరానికి కుదించారు. ఇప్పుడు ఏకంగా ఆరు భాగాలుగా విభజించి కొత్త రాజకీయానికి తెరలేపింది.


అధ్యక్షులు ఇలా...

నగర శాఖలో ఒక అధ్యక్షుడికి నాలుగు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. ఆయా ప్రాంతాలన ఒక్కో జిల్లాగా పరిగణించి అధ్యక్షులను నియమించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కొంత భాగాన్ని మహంకాళి - సికింద్రాబాద్‌ జిల్లాగా నిర్ణయించారు. ఇందులో ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. బర్కత్‌పురా - అంబర్‌పేట పరిధిలో అంబర్‌పేట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి నియోజకవర్గాలకు కలిపి డాక్టర్‌ ఎన్‌.గౌతంరావును జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.


హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గోల్కొండ - గోషామహల్‌ పరిధిలో గోషామహల్‌, చార్మినార్‌, కార్వాన్‌ నియోజకవర్గాలకు కలిపి వి.పాండుయాదవ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. భాగ్యనగర్‌-మలక్‌పేట పరిధిలో మలక్‌పేట, కార్వాన్‌, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురాలకు కలిపి సామారెడ్డి సురేందర్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మేడ్చల్‌ అర్బన్‌కు పన్నాల హరీ్‌షరెడ్డిని, రంగారెడ్డి అర్బన్‌కు సామా రంగారెడ్డిలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు.  నగర శాఖలో ఒక అధ్యక్షుడికి నాలుగు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. ఆయా ప్రాంతాలన ఒక్కో జిల్లాగా పరిగణించి అధ్యక్షులను నియమించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కొంత భాగాన్ని మహంకాళి - సికింద్రాబాద్‌ జిల్లాగా నిర్ణయించారు. ఇందులో ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్‌ను

Updated Date - 2020-09-23T10:05:20+05:30 IST