Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

ఉరవకొండ/విడపనకల్లు/వజ్రకరూరు/పామిడి/కూడే రు/కళ్యాణదుర్గం/బొమ్మనహాళ్‌/యాడికి/పుట్లూరు/తాడిపత్రి/పెద్దవడుగూరు/డీ హీరేహాళ్‌/కంబదూరు/బ్రహ్మసము ద్రం/గుంతకల్లుటౌన, డిసెంబరు3: జిల్లావ్యాప్తంగా అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. ఉరవకొండ ఎమ్మార్సీ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో లయన్స క్లబ్‌ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడారు. దివ్యాంగుల పట్ల చిన్నచూపు తగదన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలు పొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. విడపనక ల్లులో ర్యాలీగా వెళ్లి బస్టాండ్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డా రు. ఆటల పోటీలు నిర్వహించి 20 మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వజ్రకరూరులో ఎంఈఓ ఎర్రిస్వామి ఆ ధ్వర్యంలో ఎమ్మార్సీ భవనంలోనూ, కొనకొండ్ల ఆర్డీటీ పాఠశాలలో యువతరం స్వచ్ఛం సేవా సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగా యి. ఐఈడీఎ్‌సఎస్‌ టీచర్‌ రంగస్వామి, ఐఆర్పీ సురేష్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. పామిడి షాదీఖానాలో ఫాదర్‌ ఫెర్రర్‌ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి తహసీల్దార్‌ ఆర్‌వీ సునీతాబాయి, ఆర్‌డీటీ ఏటీఎల్‌ రాధ, జీఓ సరోజ, ఆర్‌డీటీ మెంబర్‌ రాధమ్మ హాజరయ్యారు. కూడేరు ర్యాలీలో ఏటీసీ తిలక్‌ విద్యాసాగర్‌, జిల్లా ఐఈఆర్డీ జిల్లా కోఆర్డినేటర్‌ దివాకర్‌ రెడ్డి, ఐ ఈఆర్టీలు మస్తానవలి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. కళ్యాణదు ర్గం కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇనచార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు పుండరీకాక్ష ఆధ్వర్యంలో ఆటలపోటీలు నిర్వ హించి ప్రతిభా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కంబాల తిమ్మారెడ్డి, శ్రీవాణి, ఉద్దీ్‌పసింహా పాల్గొన్నారు. బొమ్మనహాళ్‌ ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో తిమ్మప్ప ఆధ్వర్యంలో వి భిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయులు రాజ్‌కుమార్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. యాడికిలో శ్రీవెంకటేశ్వర మండల విభిన్న ప్రతిభావంతుల సమాఖ్య ఆధ్వర్యంలో ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాఖ్య మండల అధ్యక్షుడు కదిరప్ప, ఉపేంద్రగౌడ్‌ పాల్గొన్నారు. పుట్లూరు ఎమ్మార్సీ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్‌ విజయకుమారి మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులకు ఇష్టమైన ఆటలు ఆడించాలన్నారు. ఎంఈఓ శ్రీదేవి, ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మినరసింహులు, అశ్వర్థ, శ్రీరాములు పాల్గొన్నా రు. తాడిపత్రిలో టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ని వాసంలో దివ్యాంగులతో కేక్‌ కట్‌ చేయించారు. ఆవులతిప్పాయప ల్లి జీవనాలయంలో తాడిపత్రి ఫస్ట్‌క్లాస్‌ మెజిసే్ట్రట్‌ పద్మ మానసిక వికలాంగులతో సమావేశమయ్యారు. పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.


పెద్దవడుగూరులో నిరంతర వికలాంగుల మండల సమా ఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గ టీడీ పీ ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డి హాజరయ్యారు. ఆర్డీటీ వ్యవస్థాపకు డు ఫాదర్‌ ఫెర్రర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు జేసీ అశ్మితరెడ్డి భోజనాన్ని వడ్డించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీన ర్‌ కొండూరు కేశవరెడ్డి, గంగరాజుయాదవ్‌, బయపరెడ్డి పాల్గొన్నా రు. డీ హీరేహాళ్‌ కస్తూర్బా పాఠశాలలో ఎంఈవో తిమ్మప్ప ఆధ్వ ర్యంలో వేడుకలు జరిగాయి. వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయులు శశిధర్‌, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు. కంబదూ రు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణానాయక్‌ ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మసముద్రం భవిత కేంద్రం నుంచి మండల విద్యాధికారి ఓబుళపతి, ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున, గంగాధర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయు లు రాజన్న, అరుణ, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కేవీ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు, వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హరిప్రసాద్‌, వైద్యు లు జయవర్ధన రెడ్డి, శ్రీకాంతరెడ్డి, నస్రతజాన, టూటౌన ఎస్‌ఐ న రేంద్రకుమార్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement