జీతాలు అందని గ్రీన్‌ అంబాసిడర్లు

ABN , First Publish Date - 2021-06-22T05:27:18+05:30 IST

తెల్లారగానే వీధుల్లో చెత్తను సేకరించి గ్రామ చివరకు రిక్షాలో తరలించే గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు అందడం లేదు.

జీతాలు అందని గ్రీన్‌ అంబాసిడర్లు
రిక్షాతో చెత్తను సేకరిస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

  1. మండలంలో 59 మంది గ్రీన్‌ అంబాసిడర్లు 
  2. కుటుంబ పోషణ భారమంటూ ఆవేదన 


రుద్రవరం, జూన్‌ 21: తెల్లారగానే వీధుల్లో చెత్తను సేకరించి గ్రామ చివరకు రిక్షాలో తరలించే గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు అందడం లేదు.  రుద్రవరం మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో 59 మంది గ్రీన్‌ అంబాసిడర్లు ఉన్నారు. తమకు  9 నెలల నుంచిజీతాలు అందలేదని సోమవారం రుద్రవరం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన గ్రీన్‌ అంబాసిడర్లు మండల పరిషత్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవోను కలిసేందుకు వచ్చారు.  ఇన్‌చార్జి ఎంపీడీవో సెలవుపై వెళ్లడంతో నిరాశతో వెనక్కి వెళ్లిపోయారు. జీతాలు లేక  కుటుంబ పోషణ భారమైందని వాపోయారు. 


ఎలా బతకాలి?

9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నెలకు రూ.6 వేలు చొప్పున జీతం వస్తుందని ఆశతో పని చేస్తు న్నాం. జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి? అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పట్టించుకోవడం లేదు. 

- సుబ్బరాయుడు, ఎల్లావత్తుల 


కుటుంబ పోషణ భారమైంది

కుటుంబ పోషణ భారమైంది. పస్తులు ఉంటూ చెత్త సేకరిస్తున్నాం. ఇలా ఎన్నిరోజులు చేయాలి.

- రాజు, గ్రీన్‌ అంబాసిడర్‌, హరినగరం


నివేదిక పంపించాం

ప్రభుత్వానికి గ్రీన్‌ అంబాసిడర్ల జీతాల కోసం నివేదిక పంపిం చాం. జీతాలు గ్రీన్‌ అంబాసిడర్ల ఖాతాలో జమ అవుతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. 

- రామకృష్ణవేణి, ఈవోపీఆర్డీ, రుద్రవరం 




Updated Date - 2021-06-22T05:27:18+05:30 IST