Advertisement
Advertisement
Abn logo
Advertisement

పచ్చి మామిడి రసం

కావలసినవి: పచ్చిమామిడికాయ-ఒకటి, కందిపప్పు- ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి-ఒకటి, పసుపు-అర టీస్పూన్‌, ఉప్పు-రుచికి సరిపడినంత, నెయ్యి- రెండు టీస్పూన్లు, ఇంగువ-పావు టీస్పూన్‌, వెల్లుల్లిపాయలు-నాలుగు, పుదీనా ఆకులు-1/3 కప్పు, ఎండుమిర్చి- నాలుగు, మిరియాలపొడి-పావు టీస్పూన్‌, కరివేపాకులు-గుప్పెడు, బెల్లం తురుము-పావు టీస్పూన్‌, రసం పొడి- ఒక టీస్పూన్‌


తయారీ: మామిడికాయ మీద తొక్క పూర్తిగా తీసేసి ముక్కలుగా తరగాలి. కుక్కర్‌లో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో పచ్చిమామిడికాయముక్కలు, పసుపు, కందిపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒక విజిల్‌ వచ్చేదాకా స్టవ్‌పై ఉడి కించి, ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై దాన్ని ఉంచాలి. తర్వాత కిందికి దించి అందులో ఆవిరి పోయేదాకా అలాగే ఉంచాలి. చిన్న పాన్‌లో నెయ్యి వేడెక్కగానే అందులో ఇంగువ వేసి గరిటెతో కదపాలి. తర్వాత అందులో కరివేపాకు, వెల్లుల్లి పాయల పేస్టు, ఎండు మిర్చి వేసి వెల్లుల్లి పేస్టు బ్రౌన్‌ రంగులోకి వచ్చేదాకా వేగించాలి. ఉడకబెట్టి ఉంచిన పచ్చిమామిడి రసాన్ని, దాల్‌ని అందులో పోయాలి. వీటితో పాటు బెల్లం, మిరియాలు, రసంపొడులు, పుదీనా ఆకులను వేసి ఉడికించాలి. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలో తింటే మజాగా ఉంటుంది.

మెంతి పులుసువాము చారుకొబ్బరిపాల రసంకల్యాణ రసంబెండ పెరుగుఅలసంద సాంబారువంకాయ పచ్చి పులుసుఉలవ చారుమునగాకు రసంములక్కాడ రొయ్య పులుసు
Advertisement