గ్రీన్‌ పీస్‌ కబాబ్‌

కావలసినవి: పచ్చి బఠాణీ - ఒక కప్పు, ఉల్లిపాయలు - పావు కప్పు(తరిగినవి), పచ్చిమిర్చి - ఐదు, వెల్లుల్లి రెబ్బలు -రెండు, అల్లం ముక్క - కొద్దిగా, జీడిపప్పు - ఐదారు పలుకులు(పొడి చేసుకోవాలి), కొత్తిమీర - ఒక కట్ట, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు, సెనగపిండి - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, కార్న్‌ఫ్లేక్స్‌ - పావుకప్పు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: పచ్చిబఠాణీని శుభ్రంగా కడిగి నీళ్లను వంపేయాలి. ఒక పాత్రలో జీడిపప్పు పొడి తీసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిబఠాణీ మిక్సీలో వేసి పట్టుకోవాలి. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి కలపాలి. తగినంత ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, బియ్యప్పిండి, సెనగపిండి, నిమ్మరసం, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడల మాదిరిగా ఒత్తుకోవాలి. తరువాత వీటిని కార్న్‌ఫ్లేక్స్‌ పొడిలో అద్దుకుంటూ నూనెలో వేగించాలి. 

అంజీర్‌ - కుబానీ కి టిక్కీఆలూ గోబి (రెస్టారెంట్‌ స్టెయిల్‌)మ్యాంగో మలాయ్‌ శాండ్‌విచ్‌చిల్లీ పనీర్‌నువ్వుల పులావుసగ్గుబియ్యం వడలుదమ్‌ ఆలూస్వీట్‌ పొటాటో నూడుల్స్‌చిలగడదుంప రైస్‌స్వీట్‌ పొటాటో విత్‌ క్వినోవా
Advertisement
Advertisement