త్వరలో ‘గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సెల్‌’

ABN , First Publish Date - 2020-08-09T09:13:30+05:30 IST

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘రిడ్రెసల్‌ సెల్‌’ ఏర్పాటుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ టెండర్లను ఆహ్వానించింది. రాబోయే రెండు నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం...

త్వరలో ‘గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సెల్‌’

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘రిడ్రెసల్‌ సెల్‌’ ఏర్పాటుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ టెండర్లను ఆహ్వానించింది. రాబోయే రెండు నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సప్‌, ఫోన్‌, మెసేజ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర వాటి ద్వారా అందే ఫిర్యాదులన్నీ ఒకే చోటికి చేరేలా ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలు ఏ రూపంలో వచ్చినా ఒకే విభాగం ద్వారా పరిష్కరిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఒక కాల్‌ సెంటర్‌ కూడా ఉంటుంది. ఫిర్యాదుదారులు ఫోన్‌ చేసి తమ సమస్య పరిష్కారమయిందో లేదో ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా వాకబు చేసుకోవచ్చు.  


Updated Date - 2020-08-09T09:13:30+05:30 IST